కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐదుగురి ప్రాణాలు నిలబెట్టిన ఎనిమిదేళ్ల మనస్విని(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇటీవల గోదావరి పుష్కరాలకు వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలతో బ్రెయిన్ డెడ్‌కు గురైన ఎనిమిదేళ్ల చిన్నారి మనస్విని అవయవాలు దానం చేశారు. ఆమె చేసిన అవయవదానంతో ఐదుగురి ప్రాణాలు నిలిచాయి.

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల కేంద్రానికి చెందిన జి.గోపినాథ్, రూప దంపతులకు మనస్విని(8), సంజన అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గోపీనాత్ కుటుంబం, అతని బావమరిది రాజేష్ కుటుంబం జులై 22న రూప తల్లిదండ్రుల స్వగ్రామమైన సిద్దిపేట నుంచి గోదావరి పుష్కరాలకు వెళ్లారు.

తిరిగి వస్తుండగా నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి వద్ద ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో గోపీనాథ్, అతని బావమరిది రాజేష్ అక్కడికక్కడే మృతి చెందారు. గోపీనాథ్ కుమార్తె మనస్విని, గోపీనాథ్ భార్య రూప, రాజేష్ భార్య తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చేర్పించారు.

మనస్వినిని జులై 23న అపోలో ఆస్పత్రికి తరలించగా అదే రోజు బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో మనస్విని అమ్మమ్మ, నానమ్మ తరపు బంధువులు అవయవదానానికి ముందుకు రావడంతో ఆ చిన్నారి నుంచి రెండు మూత్రపిండాలు, కాలేయం, రెండు గుండె వాల్వులు సేకరించారు.

చిన్నారి శరీరాన్ని ఉస్మానియా మెడికల్ కళాశాలకు అప్పగించినట్లు జీవన్‌దార్ నోడల్ కేంద్ర ప్రతినిధి వేదం అనురాధ తెలిపారు. కాగా, మనస్విని మృత దేహాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం ఉస్మానియా మెడికల్ కాలేజీకి దానం చేశారు.

మనస్విని(ఫైల్)

మనస్విని(ఫైల్)

ఇటీవల గోదావరి పుష్కరాలకు వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలతో బ్రెయిన్ డెడ్‌కు గురైన ఎనిమిదేళ్ల చిన్నారి మనస్విని అవయవాలు దానం చేశారు. ఆమె చేసిన అవయవదానంతో ఐదుగురి ప్రాణాలు నిలిచాయి.

ఆస్పత్రిలో..

ఆస్పత్రిలో..

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల కేంద్రానికి చెందిన జి.గోపినాథ్, రూప దంపతులకు మనస్విని(8), సంజన అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

తల్లిదండ్రులతో..

తల్లిదండ్రులతో..

గోపీనాత్ కుటుంబం, అతని బావమరిది రాజేష్ కుటుంబం జులై 22న రూప తల్లిదండ్రుల స్వగ్రామమైన సిద్దిపేట నుంచి గోదావరి పుష్కరాలకు వెళ్లారు.

మనస్విని(ఫైల్)

మనస్విని(ఫైల్)

తిరిగి వస్తుండగా నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి వద్ద ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో గోపీనాథ్, అతని బావమరిది రాజేష్ అక్కడికక్కడే మృతి చెందారు.

English summary
Manaswini, who died in a road accident while returning from Godavari Pushkaralu, gave a new lease of life to five people by donating her liver, two kidneys and heart valves. Her family decided to donate the body to a medical college as well.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X