తెలంగాణలో స్వల్పంగా పెరిగిన కరోనా కొత్త కేసులు: జిల్లాలవారీగా కేసులు, పెరిగిన రికవరీ రేటు

హైదరాబాద్: తెలంగాణలో గత కొద్ది వారాలుగా కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే, గత 24 గంటల్లో స్వల్పంగా కరోనా కేసులు పెరిగాయి. రాష్ట్రంలో 1,09,802 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 917 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యశాఖ బుధవారం సాయంత్రం వెల్లడించింది.

Recommended Video

    Corona virus third wave myth Buster | Oneindia Telugu
    తెలంగాణలో కొత్తగా 917 కరోనా కేసులు, 10 మరణాలు

    తెలంగాణలో కొత్తగా 917 కరోనా కేసులు, 10 మరణాలు

    తాజాగా, నమోదైన 917 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,23,510కు చేరింది. కరోనాతో కొత్తగా 10 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3661కి చేరింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది.

    తెలంగాణలో 13,388 యాక్టివ్ కేసులు

    తెలంగాణలో 13,388 యాక్టివ్ కేసులు

    గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 1006 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,06,461కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,388 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో

    రికవరీ రేటు 97.26 శాతానికి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తివేసిన నాటి నుంచి స్వల్పంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.

    తెలంగాణలో జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులు

    తెలంగాణలో జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులు

    తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరో కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 02, భద్రాద్రి కొత్తగూడెంలో 52, జీహెచ్ఎంసీలో 108. జగిత్యాలలో 28, జనగామలో 09, జయశంకర్ భూపాలపల్లిలో 17, జోగులాంబ గద్వాలలో 01, కామారెడ్డిలో 05, కరీంనగర్‌లో 66, ఖమ్మంలో 58, కొమురంభీం ఆసిఫాబాద్ లో 05, మహబూబ్‌నగర్‌లో 19, మహబూబాబాద్‌లో 53, మంచిర్యాలలో 61, మెదక్‌లో 07, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 35, ములుగులో 18, నాగర్ కర్నూలులో 07, నల్గొండలో 71, నారాయణపేటలో 04, నిర్మల్‌లో 04, నిజామాబాద్‌లో 09, పెద్దపల్లిలో 39, రాజన్న సిరిసిల్లలో 20, రంగారెడ్డిలో 43, సంగారెడ్డిలో 07, సిద్దిపేటలో 29, సూర్యాపేటలో 57, వికారాబాద్ లో 07, వనపర్తిలో 10, వరంగల్ రూరల్ లో 11, వరంగల్ అర్బన్‌లో 36, యాదాద్రి భువనగిరిలో 19 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+