4,7,6,8,10,14,5.. ఇవి ర్యాంకులు కాదు.. గత వారం రోజుల్లో తెలంగాణలో కరోనా మరణాలు..
తెలంగాణలో కరోనా మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటివరకూ కరోనాతో రాష్ట్రంలో 142 మంది మృతి చెందగా.. గడిచిన వారం రోజుల్లోనే 54 మంది మృత్యువాతపడ్డారు. మంగళవారం(జూన్ 3)4,బుధవారం 7,గురువారం 6,శుక్రవారం 8,శనివారం 10,ఆదివారం 14,సోమవారం(జూన్ 8) 5 మంది మృత్యువాతపడ్డారు. గత ఆరు రోజులుగా రాష్ట్రంలో ప్రతీ రోజూ ఐదుకు పైనే కరోనా మరణాలు సంభవిస్తూ వచ్చాయి. మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళన పెరుగుతోంది.

రాష్ట్రంలో కేసుల సరళి..
ఇక సోమవారం(జూన్ 8) కొత్తగా మరో 92 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3742కు చేరుకుంది. ఇక గత వారం రోజులుగా రాష్ట్రంలో కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. జూన్ 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు వరుసగా 99,129,127,143,206,154,92 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో నమోదైన కేసులే ఎక్కువ. గత వారం రోజుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో వరుసగా 70.108,110,116,152,132 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కాస్త అటు,ఇటుగా దాదాపు ప్రతీరోజూ 100 పాజిటివ్ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

గాంధీ నుంచి నేచర్ క్యూర్ ఆస్పత్రికి తరలింపు..
గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు మాట్లాడుతూ... 50 ఏళ్లలోపు కరోనా పేషంట్లను గాంధీ ఆస్పత్రి నుంచి ఇళ్లకు తరలిస్తున్నట్లు తెలిపారు.జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలులేని వారిని ఇళ్లకు పంపించేస్తున్నామని చెప్పారు. ఇవాళ ఒక్కరోజే 393 మంది కరోనా పేషంట్లను గాంధీ ఆస్పత్రి నుంచి హోమ్ క్వారంటైన్‌కు తరలిస్తున్నట్టు చెప్పారు. తమ ఇళ్లల్లో ప్రత్యేక గది వసతి కలిగి ఉన్న 310 మందిని హోమ్ క్వారంటైన్‌కు, మిగతా 83 మందిని బేగంపేట సమీపంలోని ప్రకృతి చికిత్సాలయానికి తరలించినట్టు చెప్పారు. ఇందుకోసం 30 ప్రత్యేక అంబులెన్సులు, 3 బస్సులను వినియోగించినట్టు రాజారావు చెప్పారు. వీరంతా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటారని.. వారిపై హెల్త్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.
Recommended Video

పది పరీక్షలు రద్దు,షూటింగులకు అనుమతి...
ఇక పదో తరగతి పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలను పూర్తిగా రద్దు చేసింది. ఇంటర్నల్ మార్కుల ఆధారంగానే విద్యార్థులకు గ్రేడింగ్ ఇచ్చి ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. కరోనా విజృంభిస్తున్న తరుణంలో పరీక్షలు నిర్వహించడం విద్యార్థుల ప్రాణాలను రిస్క్‌లో పెట్టడమేనని భావించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అలాగే లాక్‌డౌన్‌తో రెండున్నర నెలలుగా నిలిచిపోయిన సినిమాలు, టీవీ సీరియళ్ల షూటింగ్‌లకు అనుమతిచ్చింది. అయితే లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ.. తక్కువమందితో షూటింగులు జరుపుకోవాలని చెప్పింది. థియేటర్లకు మాత్రం ఇప్పట్లో అనుమతి లేదని స్పష్టం చేసింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications