తెలంగాణలో కరోనా విజృంభణ: 11వేలు దాటిన కేసులు, 230కి పెరిగిన మరణాలు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు మరింతగా పెరుగుతున్న కేసులు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా, గురువారం ఒక్క రోజే 920 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 11వేల మార్కును దాటింది.

ఇప్పటివరకు ఒక్కరోజు నమోదైన కేసులు ఇదే అత్యధికం కావడం గమనార్హం. గురువారం 3616 నమూనాలు పరీక్షించగా.. 2696 నెగిటివ్ అని తేలింది. 920 పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11, 364కు చేరింది.

 920 new corona positive cases recorded in telangana: five more deaths

తెలంగాణలో గురువారం మరో ఐదు మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 230కి పెరిగింది. రాష్ట్రంలో గురువారం మరో 327 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4688కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6446 యాక్టివ్ కేసులున్నాయి.

Recommended Video

    తెలుగురాష్ట్రాల మధ్య Bus సర్వీసులకు బ్రేక్.. AP లో సిటీ బస్సులకు గ్రీన్ సిగ్నల్! || Oneindia Telugu

    కాగా, తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 737 కేసులు నమోదు కావడం నగరవాసులను ఆందోలనకు గురిచేస్తోంది. రంగారెడ్డి జిల్లాలో 86, మేడ్చల్ జిల్లాలో 60, కరీంనగర్ జిల్లాలో 13 చొప్పున కేసులు నమోదయ్యాయి. రాజన్నసిరిసిల్లలో 4, మహబూబ్ నగర్ లో 3, నల్గొండలో 3, మెదక్, వరంగల్ అర్బన్, ములుగులో 2 కేసుల చొప్పున గుర్తించారు. వరంగల్ రూరల్, కామారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, జనగామ, మహబూబాబాద్, ఆదిలాబాద్, కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాలో ఒక్కో కేసు నమోదైంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+