Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అటెండర్ నుండి ఆర్డీవో వరకు.. 95శాతం స్థానికులకే ఉద్యోగాలు; కాంట్రాక్ట్ ఉద్యోగులకూ సీఎం కేసీఆర్ వరాలు

ఎప్పుడెప్పుడా అని నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్న సందర్భం రానే వచ్చింది. తెలంగాణ సీఎం కేసీఆర్ నిరుద్యోగుల ఆవేదన తీర్చే కీలక ప్రకటన అసెంబ్లీ వేదికగా చేశారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల రెండో రోజు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటన చేశారు. అంతేకాదు 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

Recommended Video

    Telangana Job Notifications: ఎన్నికల టైం CM KCR Big Announcement | Assembly Sessions |OneindiaTelugu
    అటెండర్ నుండి ఆర్డీవో వరకు స్థానికులకే

    అటెండర్ నుండి ఆర్డీవో వరకు స్థానికులకే

    అటెండర్ నుండి ఆర్టీవో వరకు స్థానికులకే అవకాశం ఇస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో శాశ్వత ప్రాతిపదికన తెలంగాణ నిరుద్యోగులకు న్యాయం చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఉద్యోగులు సంతోషంగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలోనే ఉద్యోగులు అధికంగా వేతనాలు తీసుకుంటున్న రాష్ట్రం తెలంగాణా అని పేర్కొన్న కెసిఆర్ అసలు ఉద్యోగి కంటే కాంట్రాక్టు ఉద్యోగులు ఎక్కువ పని చేస్తారని వ్యాఖ్యానించారు.

     కాంట్రాక్ట్ ఉద్యోగులకు కేసీఆర్ గుడ్ న్యూస్

    కాంట్రాక్ట్ ఉద్యోగులకు కేసీఆర్ గుడ్ న్యూస్

    ఈరోజు నుంచి 91, 142 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు సీఎం కేసీఆర్. ఇదే సమయంలో కాంట్రాక్టు ఉద్యోగులకు కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో 80,039 ఉద్యోగాలకు ఇవ్వాల్టి నుండే నోటిఫికేషన్ ఇస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. అసెంబ్లీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పై మాట్లాడిన కేసీఆర్ 9, 10 షెడ్యూల్ పంచాయితీ ఇంకా పరిష్కారం కాలేదని వెల్లడించారు. ముల్కీ రూల్స్ కు మించి స్పిరిట్ ఇంప్లిమెంట్ రావాలని ఆయన పేర్కొన్నారు.

     ఆలస్యం అయినా నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నదే తమ ఉద్దేశం : కేసీఆర్

    ఆలస్యం అయినా నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నదే తమ ఉద్దేశం : కేసీఆర్

    ఆలస్యం అయినా నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నదే తమ ఉద్దేశమని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఇప్పటి వరకు లక్ష 30 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని పేర్కొన్న కెసిఆర్ 22 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని, ఇంకా లక్ష 50 వేల ఉద్యోగాలను నోటిఫై చేశామని వెల్లడించారు. మొత్తం ప్రత్యక్ష నియామక ఖాళీలు 91,142 ఉన్నాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పోగా 80,039 ఖాళీలు ఉన్నట్లుగా పేర్కొన్న కేసీఆర్ వాటిని త్వరలోనే భర్తీ చేస్తామని, స్థానికులకే అవకాశం ఇస్తామని తేల్చిచెప్పారు.

    యూనివర్సిటీలలోనూ ఉద్యోగాల భర్తీ చేపడతాం: సీఎం కేసీఆర్

    యూనివర్సిటీలలోనూ ఉద్యోగాల భర్తీ చేపడతాం: సీఎం కేసీఆర్

    ఇక ఇదే సమయంలో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో టీచింగ్ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. త్వరలోనే ఈ ప్రక్రియను చేపడతామని ఆయన శాసనసభ వేదికగా ప్రకటించారు. తెలంగాణ పరిధిలోని అన్ని యూనివర్సిటీలలో 2020 బోధనా పోస్టులను, 2774 బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+