గుండె పోటుతో 12 ఏళ్ల బాలిక మృతి..

గుండె పోటు మరణాలు ఆందోళన కలిగిస్తోన్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా గుండె పోటు వస్తోంది. కొద్ది రోజుల క్రితం కేపీహెచ్బీలో ఓ విష్ణువర్ధన్ అనే యువకుడు హార్ట్ అటాక్ తో కన్నుమూశాడు. అతను గత సోమవారం ఉదయం స్థానిక హనుమాన్ దేవాలయానికి వెళ్లాడు. గుడిలో ప్రదక్షిణాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పిల్లర్ ను పట్టుకుని కుప్పకూలిపోయాడు. వెంటనే గమనించిన అక్కడున్న వారు అతనికి సీపీఆర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అతను గుడిలోనే కన్నుమూశాడు.

విష్ణువర్ధన్ గుడిలో ప్రదక్షిణలు చేస్తూ కుప్పకూలిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మూడు రోజుల క్రితం ఓ యువకుడు బరాత్ లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. గుండెపోటుతో మృతి చెందాడు. జగిత్యాల జిల్లా కమ్మరిపేట గ్రామానికి చెందిన 23 ఏళ్ల సంజీవ్ అనే యువకుడు మేనమామ కొడుకు పెళ్లికి మోత్కూరావుపేట వెళ్లాడు. అందరితో కలిసి సరదాగా గడిపాడు. నవంబర్ 13న పెళ్లిలో కూడా జాలిగా ఎంజాయ్ చేసి రాత్రి బరాత్ కూడా బాగా డ్యాన్స్ చేశాడు.

A 12-year-old girl died of a heart attack in Chennuru

ఇలా డ్యాన్స్ చేస్తున్న క్రమంలోనే సంజీవ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కింద పడిన అతన్ని వెంటనే జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. అయితే సంజీవ్ అప్పటికే మృతి చెందిన వైద్యులు తెలిపారు. దీంతో పెళ్లి ఇంట విషాదం నెలకొంది. తాజాగా 12 సంవత్సరాల చిన్నారి గుండె పోటుతో చనిపోయింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పద్మానగర్‌ కాలనీలో జరిగింది. శుక్రవారం 12 ఏళ్ల బాలిక గుండెపోటుతో కన్నుమూసింది. శ్రీనివాస్, రమ్య దంపతుల కుమార్తె కస్తూరి నివృత్తి ఉంది.

స్నానం చేసి డ్రెస్‌ వేసుకున్న వెంటనే బాలిక కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు ఆమెను చెన్నూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. కానీ బాలిక అప్పటికే కన్నుమూశారు. నివృత్తి చెన్నూరులోని ఒక ప్రైవేట్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. కార్తీక మాసం పౌర్ణమిని పురస్కరించుకుని వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్న ఆమె తల్లిదండ్రులు ఊహించని షాక్ తగిలింది. ఈ గుండె పోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+