హైదరాబాద్‌లో ఆస్ట్రేలియా పర్యాటకురాలి అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌: నగరంలోని టోలీచౌకి అక్బర్‌పురాలో ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళా పర్యాటకురాలు గురువారం అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్ట్రేలియాకు చెందిన మార్గరేట్‌ లిండా(53) కొద్దిరోజుల క్రితం నగర సందర్శనకు వచ్చింది. 15రోజులుగా నైజీరియాకు చెందిన ఆల్బర్ట్‌ అనే వ్యక్తి ఇంట్లో ఉంటోంది.

కాగా, గురువారం మధ్యాహ్నం టోలీచౌకి అక్బర్‌పురాలో మార్గరేట్‌ అనుమానాస్పదంగా మృతిచెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు గొల్కొండ పోలీసులకు సమాచారం అందించారు.

మార్గరేట్‌ మృతదేహం వద్ద ఆస్తమా వ్యాధికి వేసుకునే మందులను గుర్తించామని... ఆ మాత్రల డోస్‌ ఎక్కువ కావడంతోనే మృతిచెంది ఉంటుందని సీఐ ఖలీల్‌ పాషా అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

A Australian woman allegedly died at Golkonda fort

క్లూస్ టీం కూడా ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ సేకరిస్తోంది. లిండా గురువారం మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా, మార్గరేట్ విజిటింగ్ వీసాపై నగరానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆమె వీసా గడువు అక్టోబర్, 2016 వరకు ఉన్నట్లు సమాచారం.

రోడ్డు ప్రమాదంలో యువతి, యువకుడు మృతి

కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం కొత్తపల్లి వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న దిమ్మెను ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయణిస్తున్న యువతి, యువకుడు మృతిచెందారు.

బాధితులు రామగుండం నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా కొత్తపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతులు నల్గొండ జిల్లాకు చెందిన వ్యవసాయ విద్యార్థి మనోహర్‌ నాయక్‌, రామగుండానికి చెందిన ఎంబీబీఎస్‌ విద్యార్థిని హిమబిందుగా గర్తించారు. విద్యార్థుల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+