చికిత్స చేసేందుకు ఇంటికొచ్చిన వైద్యురాలిని రేప్ చేసిన వ్యాపారవేత్త, బెదిరింపులు
హైదరాబాద్: చికిత్స చేసేందుకు ఇంటికి వచ్చిన ఓ మహిళా ఫిజియోథెరఫీ వైద్యురాలిపై ఓ వ్యాపారవేత్త అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెకు మత్తు మందిచ్చి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నగర శివారు ప్రాంతం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బండ్లగూడలో చోటు చేసుకుంది.
వైద్యం అందించేందుకు వెళితే నిందితుడు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు పోలీసులకు చేసింది. కోరినప్పుడల్లా రాకపోతే తన కూతుర్ని చంపుతానని బెదిరింపులకు గురిచేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఘట్‌కేసర్ వద్ద డీజిల్ ట్యాంకర్ బోల్తా
రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ సమీపంలో హెచ్‌టీపీఎల్ వద్ద బుధవారం సాయంత్రం డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. డీజిల్ రహదారిపై పారడంతో హైదరాబాద్-వరంగల్ హైవేలో రాకపోకలు నిలిచిపోయాయి.
ట్యాంకర్ బోల్తా పడగానే స్థానికులు భయభ్రాంతులకు గురై దూరంగా పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications