బావిలోకి దూసుకెళ్ళిన కారు: తల్లీకుమారుడు మృతి, సాయం చేసేందుకు వెళ్లిన గజఈతగాడు కూడా

మెదక్: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ వద్ద కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లిన ఘటనలో మరో విషాదం చోటు చేసుకుంది. బావి నుంచి వెలికి తీసిన కారులో రెండు మృతదేహాలు బయటపడగా, కారు బావి నుంచి బయటకు తీసేందుకు సహాయక చర్యల్లో పాల్గొన్న గజఈతగాడు కూడా ప్రాణాలు కోల్పోయాడు.

బుధవారం మధ్యాహ్నం దుబ్బాక మండలం చిట్టాపూర్ వద్ద టైరు పేలడంతో కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. బావిలో నిండుగా నీళ్లు ఉండటంతో దాదాపు ఆరు గంటలపాటు సహాయక చర్యలు కొనసాగాయి. గజఈతగాళ్ల సాయంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కారును తీసేందుకు ముమ్మర ప్రయత్నం చేశారు.

 A car drowned into the well in siddipet district: in this incident three people killed

రెండు మోటార్ల సాయంతో బావిలోని నీటిని ఖాళీ చేసేందుకు యత్నించారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. బావిలో నుంచి కారును తీసేందుకు గజఈతగాళ్లు తీవ్రంగా శ్రమించారు. మోటార్ల సాయంతో బావిలోని కొంత మేర నీరు తీసేసిన తర్వాత గజఈతగాడు నర్సింహులు కారుకు తాడును బిగించాడు.

అయితే, తాడును బిగించిన అనంతరం బయటకు వచ్చే క్రమంలో కారుకు చిక్కుకుపోయి నర్సింహులు కూడా నీటిలోనే ప్రాణాలు కోల్పోయాడు. బావిలోకి దూసుకెళ్లిన కారులోనుంచి తల్లీకుమారుడు లక్ష్మీ, ప్రశాంత్ మృతదేహాలను వెలికి తీశారు. మృతులు మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామ వాసులుగా గుర్తించారు. నర్సింహులు బావి అడుగున కారుకు తాడు క్రమంలో ఊపిరాడక చనిపోయినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. సాయం చేద్దామని వచ్చిన గజఈతగాడు నర్సింహులు మృతిచెందడంతో ఇనగుర్తి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

హైదరాబాద్‌లో ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య

Recommended Video

    వరి పంట వేయొద్దని చెప్పేందుకు కేసీఆర్ ఎవరు..? || Oneindia Telugu

    హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి పరిధిలో ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తున్న శతాబ్ధి(32) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తన ఫ్లాట్ లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. శతాబ్ది గది నుంచి దుర్వాసన వస్తుండటం గమనించిన సహచరులు అపార్ట్‌మెంట్ సెక్యూరిటీకి సమాచారం అందించారు. దీంతో గదిలోకి వెళ్లి చూడగా శతాబ్ది ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. శతాబ్ది ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుజరాత్‌లో ఉన్న మృతురాలి కుటుంబసభ్యులకు సమాచారం తెలియజేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+