భారీ కుంభకోణం: తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ పై కేసు నమోదు

తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో రూ. 1000 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. 75 కంపెనీలు అవకతవకలకు పాల్పడినట్లు ఫోరెన్సిక్ ఆడిట్ వెల్లడించింది.

కమర్షియల్ టాక్స్ కమిషనర్ రవి ఫిర్యాదుతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తోపాటు పలువురిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. కమర్షియల్ టాక్స్ అడిషనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లపై కేసు నమోదైంది. నిందితులపై 406, 409, 120(బీ) చట్టం కింద సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.

A case has been registered against former Telangana CS Somesh Kumar

ప్రభుత్వ భూముల పరిరక్షణకు టోల్​ఫ్రీ నంబర్​

హైదరాబాద్ నగరంలో నానాటికీ భూముల ధరలు భారీగా పెరగుతుండటంతో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. నగరం చుట్టూ ప్రభుత్వ భూములను గుర్తించి వివరాలు పక్కాగా నమోదు చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించింది. ఎవరైనా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే తక్షణం ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ, కంట్రోల్ రూమ్ నెంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

భూ ఆక్రమణలకు సమాచారాన్ని తమకు తెలియజేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. ఆక్రమణల వివరాలు టోల్ ఫ్రీ నెంబర్ 1800599 0099, కంట్రోల్ రూమ్ 04029560509, 04029560596, 04029565758, 04029560953 సమాచారమివ్వాలని ఆయన కోరారు. వివరాలను [email protected] ద్వారా మెయిల్ చేయవచ్చన్నారు. ఆక్రమణల సమాచారం నేరుగా కమిషనర్​ను కలిసి వివరించాలనుకుంటే ముందుగా 7207923085 నెంబర్‌​కు మేసేజ్​ పంపించాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+