Mallareddy: కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు..
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు అయింది. ఐటీ అధికారులు బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో మంత్రి మల్లారెడ్డిపై ఫిర్యాదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును దుండిగల్ కు బదిలీ చేశారు. మల్లారెడ్డిపై సెక్షన్ 342, 353, 201, 504, 506, 353, 379 R/W 34 కింద కేసు నమోదు చేశారు. డ్యూటీలో ఉన్న ఐటీ అధికారి విధులకు భంగం కలిగించారని కేసు నమోదు అయింది. ఐటీ సోదాల్లో సేకరించిన పత్రాలు, పంచనామా ఐటీ అధికారుల సెల్ ఫోన్లను లాక్కున్నారని మల్లారెడ్డిపై ఆరోపణలు వచ్చాయి.

అర్ధరాత్రి హైడ్రామా
గత అర్ధరాత్రి దాటిన తర్వాత మంత్రి మల్లారెడ్డి ఇంటి వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. తన కుమారుడు మహేందర్ రెడ్డిపై ఒత్తిడిచేసి ఆదాయపన్ను శాఖ అధికారులు కొన్ని కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారని మల్లారెడ్డి బోయినపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోదాల అనంతరం మల్లారెడ్డి కుమారుడితో పంచనామాపై సంతకం పెట్టించుకున్నారు. దీంతో ఐటీ అధికారులకు, మంత్రి మల్లారెడ్డికి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలిసింది.

రత్నాకర్
మల్లారెడ్డి ఐటీ అధికారి రత్నాకర్ పై పోలీసులకు ఫిర్యదు చేశారు. వైద్య కళాశాలలకు మూడేళ్లలో వంద కోట్ల రూపాయల విరాళాలు తీసుకున్నట్లు తన కుమారుడితో బలవంతంగా సంతకం చేయించుకున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. ఇప్పటివరకూ ఐటీ సోదాల్లో 10 కోట్ల 50 లక్షల డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మల్లారెడ్డి ఇంట్లో సోదాలు ముగిసిన తర్వాత నోటీసులు ఇచ్చిన ఐటీ అధికారులు.. 28న తమ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

దాడులు
గురువారం మంత్రి మల్లారెడి ప్రెస్ మీట్ పెట్టారు. బీజేపీ కుట్రలకు భయపడేది లేదన్నారు. కేంద్ర బలగాలతో మాపై పెద్దఎత్తున దాడులు చేశారని ఆరోపించారు.మమ్మల్నేకాదు కేసీఆర్ ను కూడా ఏం చేయలేరు అన్నారు. మెడికల్ సీట్ల అడ్మిషన్ల్ లో అక్రమాలు జరిగాయని చెబుతున్నారని.. మెడికల్ సీట్లకు డొనేషన్లు తీసుకోలేదని మంత్రి చెప్పారు. ఐటీ దాడులు ఉంటాయని కేసీఆర్ ముందే చెప్పారని మల్లారెడ్డి తెలిపారు. కాగా మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి గురువారం హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకే దాడులు జరుగుతున్నాయని అన్నారు. తాము చట్ట ప్రకారం ట్యాక్స్ కడుతున్నామని చెప్పారు. పార్టీ మారాలనే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications