హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మొన్న హెల్మెట్: హైదరాబాద్ రోడ్లపై కరోనా కారు: 100 సీసీ ఇంజిన్.. 40 కిలోమీటర్ల వేగం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన, చైతన్యాన్ని కల్పించడానికి ఇప్పటికే వేర్వేరు రూపాల్లో కరోనా వైరస్ కళ్ల ముందు కదలాడింది. హైదరాబాద్ పోలీసులు కొద్దిరోజుల కిందటే కరోనా హెల్మెట్‌ను తీసుకొచ్చారు. దాన్ని ధరించి, విధి నిర్వహణల్లో పాల్గొంటున్నారు. కరోనా రూపాన్ని పోలీన తినుబండారాలకు లెక్కేలేదు. కరోనా వైరస్‌ను పోలిన స్వీట్లు జనానికి పరిచయం అయ్యాయి. అదే సిరీస్‌లో కొత్తగా కరోనా కారు కూడా రోడ్ల మీదికి వచ్చింది.. హైదరాబాద్‌లో.

Recommended Video

కరోనా Car In Hyderabad Going Viral || కరోనా వైరస్ కాదు, కరోనా కారు చూసారా ?

ఏపీలో మరో 15 పాజిటివ్: కొత్త కేసులన్నీ ఆ మూడు జిల్లాల్లోనే: సమయాన్ని కుదించే దిశగా..ఏపీలో మరో 15 పాజిటివ్: కొత్త కేసులన్నీ ఆ మూడు జిల్లాల్లోనే: సమయాన్ని కుదించే దిశగా..

బహదూర్‌పురాలోని సుధా కార్స్ మ్యూజియం యజమాని కే సుధాకర్ దీన్ని రూపొందించారు. డిఫరెంట్‌గా కార్లను రూపొందించడం ఆయన ప్రత్యేకత. సీజన్‌కు తగ్గట్టుగా సుధాకర్ ఇదివరకు చాలా కార్లను తయారు చేశారు. తాజాగా కరోనా వైరస్‌ డిజైన్‌తో కరోనా కారును రూపొందించారు. 100 సీసీ ఇంజిన్ గల ఈ కరోనా కారు.. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో తాను దీన్ని రూపొందించానని సుధాకర్ తెలిపారు.

A ‘corona car’ has been in designed in Sudha Cars museum Hyderabad for spreading awareness

ఈ సింగిల్ సీటర్ వాహనాన్ని తయరు చేయడానికి పది రోజులు పట్టిందని అన్నారు. బహదూర్‌పురాలోని తన మ్యూజియం ఆవరణలో ఆయన దీన్ని ప్రదర్శించారు. ఇదివరకు ఆయన హ్యాండ్‌బ్యాగ్, షూ, హెల్మెట్, కెమెరా, టాయ్‌లెట్, కండోమ్ రకాల్లో కార్లను తయారు చేశారు. వ్యక్తిగత మరుగుదొడ్ల ప్రాధాన్యాన్ని, హెల్మెట్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాల వివరిస్తూ టాయ్‌లెట్ కారు, హెల్మెట్ కారను తయారు చేసిన సమయంలో ప్రభుత్వం ఆయనను ప్రశంసించింది.

తాజాగా ఆయన కరోనా కారును రూపొందించారు. మూడు చక్రాల వాహనాన్ని ఆయన దీనికోసం వినియోగించారు. కరోనా వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడానికి తాను దీన్ని తయారు చేశానని, హైదరాబాద్ పోలీసుల సేవ కోసం పంపించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేలాదిమందిని పొట్టన బెట్టుకుందని, ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎవరూ బయటికి రావొద్దని ఆయన విజ్ఙప్తి చేశారు.

English summary
A ‘corona car’ has been designed by Sudhakar of Sudha Cars Museum in Bahadurpura for spreading awareness about the pandemic.“The spread of Covid-19 has to be contained. I have designed the car in the shape of the virus which is depicted popularly so that awareness can be spread on social distancing by the public,” Sudhakar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X