దంపతులపై పట్టపగలే వేటకొడవళ్లతో దాడి: భర్త మృతి, భార్యకు తీవ్రగాయాలు

Subscribe to Oneindia Telugu

మహబూబ్‌నగర్: జిల్లాలోని జడ్చర్ల మండలం నాగసాలలో పట్టపగలే దారుణ ఘటన చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులపై ఆటోలో వచ్చిన నలుగురు దుండగులు దాడికి పాల్పడ్డారు.

వేట కొడవళ్లతో దాడి చేసి విచక్షణారహితంగా నరకడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలిని స్థానికులు సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

A couple attacked by thugs: husband died, wife seriously injured

ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కాగా, బాధితులు నాగర్‌కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం కేంద్రానికి చెందిన వెంకటయ్య, సుజాతగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A couple attacked by four thugs in Mahabubnagar district. in this incident husband died and wife seriously injured.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి