అర్దరాత్రి దంపతులపై ఆకతాయిల దాడి.. షాకింగ్ వీడియో..

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే అర్ధరాత్రి సమయంలో దంపతులపై ఆకతాయిలు కొందరు దాడికి తెగబడ్డారు. బస్సు దిగి కాలినడకన ఇంటికి వెళుతున్న దంపతులను కారుతో వెంబడించి దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు కొందరు ఆకతాయిలు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై జహీరాబాద్లో చర్చ జరుగుతోంది.

అర్దరాత్రి దంపతులపై ఆకతాయిల దాడి

పోలీస్ స్టేషన్ కు దగ్గరలోనే జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే ఆదివారం రాత్రి జహీరాబాద్ బస్ స్టాండ్ లో బస్సు దిగి శాంతినగర్ కు చెందిన ఇద్దరు దంపతులు బ్లాక్ రోడ్డు నుండి నడిచి వెళ్తున్న క్రమంలో కొందరు వ్యక్తులు కారులో వెంబడించి పరుష పదజాలంతో దూషించారు. అక్కడితో ఆగక కారు దిగి వారిపై దాడికి పాల్పడ్డారు. తమను వారు ఎందుకు కొడుతున్నారో, ఎందుకు తిడుతున్నారో అర్థంకాని పరిస్థితిలో ఆత్మరక్షణ కోసం సదరు మహిళ ఫోన్ చేసే ప్రయత్నం చేసింది. దీంతో ఎవరికి ఫోన్ చేస్తున్నావని సదరు మహిళను విచక్షణారహితంగా కొట్టారు. ఆమె చెయ్యి మెలిపెట్టి మరీ ఆమె పైన దాడికి పాల్పడ్డారు. కనీసం మహిళ అన్న మానవత్వం కూడా లేకుండా ఆమెపై దాడి చేశారు.

వీడియో వైరల్ కావటంతో వెలుగులోకి వచ్చిన ఘటన

వీడియో వైరల్ కావటంతో వెలుగులోకి వచ్చిన ఘటన

పట్టణంలోని శాంతినగర్ లో నివసించే దంపతులపై దాడి జరిగినట్లుగా తాజాగా బయటకు వచ్చిన వీడియో ఆధారంగా తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తి వీరిపై జరుగుతున్న దాడిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఆకతాయిలు దంపతులపై దాడి చేసిన ఘటనకు సంబంధించి జహీరాబాద్ పట్టణ పోలీస్ ఎస్సై శ్రీకాంత్ దాడి జరిగిందని, నిందితుడి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. అయితే ఈ దాడి ఘటనకు పాల్పడిన వారి వెనుక రాజకీయ నాయకులు ఉన్నారని, అందుకే వారిని కాపాడే ప్రయత్నం జరుగుతోందని స్థానికంగా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

నిందితులపై చర్యలపై పోలీసుల తాత్సారం

నిందితులపై చర్యలపై పోలీసుల తాత్సారం


అసలు వారు ఆ దంపతులపై ఎందుకు దాడికి పాల్పడ్డారు? వారికి, దంపతులకు మధ్య ఆ అర్దరాత్రి ఏం జరిగింది? అన్నది తెలియాల్సి ఉంది. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే ఇదంతా జరిగినా, ఏకంగా ఎవరు దాడికి పాల్పడ్డారు అన్నదానిపై వీడియోనే వైరల్ అయినా కూడా పోలీసులు ఈ కేసును ఇంకా దర్యాప్తు చేస్తున్నాము. నిందితులను పట్టుకుంటామని చెప్పడం స్థానికులకు ఆగ్రహం తెప్పిస్తుంది. వీడియో లో అంత క్లియర్ గా నిందితులు కనిపిస్తుంటే పోలీసులు వారిని పట్టుకోవడం లో ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

దీని వెనక రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని, వారు సదరు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై పోలీసులు రియాక్ట్ అయ్యారు. పోలీసులు స్పందించి వీడియో ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. వారు శాంతినగర్ కాలనీకి చెందిన మహ్మద్ సూఫియాన్, తండ్రి గౌసుద్దీన్, నాల్సబ్ మెహల్లాకు చెందిన మహ్మద్ సమీర్‌లుగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఘటనకు సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలతో నిందితులను జహీరాబాద్ న్యాయస్థానంలో హాజరు పర్చగా నేరస్తులను ఇద్దరినీ జుడీషియల్ రిమాండ్‌కు పంపుతూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

రాత్రి వేళల్లో తిరగాలంటే చాలా భయంగా ఉందని.. ఎవరు ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తారో అన్న భయం నెలకొందని స్థానికులు చెబుతున్నారు. నిత్యం పోలీసు పహారా ఉండేలా చూస్తే ఇలాంటి నేరాలు అదుపులోకి వస్తాయని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+