Vemulawada: రాజన్న సన్నిధిలోనే ప్రాణాలు వదిలిన భక్తురాలు..
దేవుడి దర్శనం కోసం వచ్చిన దేవుడి సన్నిధిలోనే తుదిశ్వాస విడిచింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో ఓ భక్తురాలు గుండెపోటుతో మృతి చెందారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లింగాపూర్ కు చెందిన లక్ష్మి అననే మహిళ సోమవారం కుటుంబంతో కలిసి రాజన్న దర్శనం కోసం వచ్చారు. అయితే సోమవారం కావడంతో భక్తుల రద్దీ భారీగా ఉంది.
రాజన్న దర్శనం చేసుకోవడం సోమవారం సాధ్యం కాలేదు. దీంతో మంగళవారం రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకుందామని ఆ కుటుంబం ఆలయ ఆవరణలో నిద్రించింది. ఆ కుటుంబం మంగళవారం తెల్లవారజామును స్నానాలు ముగించుకుని దేవుడి దర్శనం కోసం క్యూ లైన్ లో వేచి ఉన్నారు. ఆమె క్యూ లైన్ లో నిలుచున్న లక్ష్మి ఒక్కసారిగా కింద పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆలయ అధికారులకు సమాచారం ఇచ్చింది.

ఆమెను వెంటనే వైద్యులు వచ్చి పరీక్షించగా.. అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. దీంతో ఆ కుటుంబం లక్ష్మి మృదేహాన్ని తీసుకుని స్వస్థలానికి వెళ్లిపోయారు. అయితే ఆలయంలో సరైన ఏర్పాట్లు లేవని భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. క్యూలైన్లు చిన్నగా ఉండడంతో పాటు సరైన సదుపాయలు లేక ఇబ్బందిగా ఉందని భక్తులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
అటు జగిత్యాల జిల్లా కొండగట్టులో హనుమాన్ దర్శనానికి వచ్చిన కిష్టయ్య అనే ఓ వృద్ధుడు ప్రాణాలు విడిచాడు. ఈ వృద్ధుడు కూడా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి స్వస్థలం హనుమకొండ జిల్లా కమలా పూర్. కిష్టయ్య కోనేరులో స్థానం చేసి వెళ్తుండగా కుప్పకూలిపోయాడు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించారు.












Click it and Unblock the Notifications