పెను విషాదం: ఒకే కుటుంబంలో ఆరుగురు ఆత్మహత్య

Subscribe to Oneindia Telugu

సూర్యాపేట: జిల్లా కేంద్రంలోని మామిళ్లగడ్డలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అప్పులబాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య తెలిసింది.

ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సూర్యాపేట పట్టణంలోని స్థానిక కస్తూరి బజార్‌లో నివాసం ఉంటున్న బాధిత కుటుంబం గత కొంతకాలం నుంచి ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. దీంతో ఆ కుటుంబానికి చెందిన ఆరుగురు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.

A family committed suicide in Suryapet

సోమవారం ఉదయం స్థానికులు గమనించేసరికి వారు విగతజీవులుగా కనిపించారు.
మృతులలో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులను కస్తూరి జనార్దన్ (59), చంద్రకళ(50), ప్రభాత(3౦), అశోక్(25), సిరి(5) రుత్విక (2)లుగా పోలీసులు గుర్తించారు. కాగా, ఆర్థిక ఇబ్బందులే వీరి ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A family allegedly committed suicide in Suryapet district due to debts problems.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి