‘దేశ్‌కా నేత కేసీఆర్’: కాశీలో భారీ ఫ్లెక్సీలు, కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలంటూ అబిమాని వినూత్నం

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం బాగోలేక శుక్రవారం యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న విషయం తెలిసిందే. దీంతో కేసీఆర్ ఆరోగ్యానికి ఏమైందంటూ పలువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, సీఎం కేసీఆర్ ఆరోగ్యం బాగానే ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో పరీక్షలు చేసుకున్న అనంతరం ఆస్పత్రి నుంచి కేసీఆర్ నడుచుకుంటూనే బయటకు వచ్చారు. ఆ తర్వాత ప్రగతి భవన్ చేరుకున్నారు.

కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలంటూ కాశీలో అభిమాని మొక్కులు

కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలంటూ కాశీలో అభిమాని మొక్కులు

ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వెంటనే కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆకాంక్షించారు. కాగా, ఓ అభిమాని మాత్రం వినూత్న రీతిలో కాశీలోని విశ్వేశ్వరుడికి మొక్కులు చెల్లించుకున్నాడు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాయి అనే అభిమాని ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో శుక్రవారం సాయంత్రం దీపారాధన కార్యక్రమం నిర్వహించి గంగా నదిలోని బోట్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు.

దేశ్ కా నేత కేసీఆర్ అంటూ కాశీలో భారీ ఫ్లెక్సీలు

దేశ్ కా నేత కేసీఆర్ అంటూ కాశీలో భారీ ఫ్లెక్సీలు

ఇలా కేసీఆర్ పట్ల తన అభిమానాన్ని చాటుకున్నాడు. 'దేశ్‌కా నేత కేసీఆర్' అంటూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవితతో పాటు ఇతర టీఆర్‌ఎస్ నేత ఫొటోలను కూడా బోట్ల మీద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో వేయించాడు. కాశీ విశ్వనాథుడు సీఎం కేసీఆర్‌కు సంపూర్ణ ఆరోగ్యం కల్పించాలని ప్రార్థిస్తూ ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశానని సాయి తెలిపాడు.

స్వల్ప అస్వస్థతో ఈ ఉదయం ఆస్పత్రిలో చేరిన కేసీఆర్

స్వల్ప అస్వస్థతో ఈ ఉదయం ఆస్పత్రిలో చేరిన కేసీఆర్

ఇది ఇలావుండగా, స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గురైన సీఎం కేసీఆర్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో కలిసి శుక్ర‌వారం ఉద‌యం సోమాజిగూడ‌లోని య‌శోద ఆస్ప‌త్రికి చేరుకున్న సంగ‌తి తెలిసిందే. సీఎం కేసీఆర్‌కు వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్‌కు గుండె, యాంజియో పరీక్షలు నిర్వహించినట్లుగా సీఎంవో వెల్లడించింది. అన్ని రిపోర్టులు నార్మల్‌గానే ఉన్నాయి. కాగా, కేసీఆర్ వెంట ఆయ‌న స‌తీమ‌ణి శోభ‌, కుమారుడు కేటీఆర్, మ‌నుమ‌డు హిమాన్షు, కూతురు క‌విత‌, అల్లుడు అనిల్, మంత్రి హ‌రీశ్‌రావు, ఎంపీ సంతోష్ కుమార్‌తో పాటు ప‌లువురు ఉన్నారు.

కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారంటూ యశోద వైద్యులు

కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారంటూ యశోద వైద్యులు

సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నార‌ని, ఎవ‌రూ ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని య‌శోద ఆస్ప‌త్రి వైద్యులు డాక్ట‌ర్ ఎంవీ రావు స్ప‌ష్టం చేశారు. సీఎం కేసీఆర్‌కు ఏటా ఫిబ్ర‌వ‌రిలో సాధార‌ణ చెక‌ప్ చేస్తామ‌ని చెప్పారు. గ‌త రెండు రోజుల నుంచి బ‌ల‌హీనంగా ఉన్న‌ట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. ఎడ‌మ చేయి, ఎడ‌మ కాలు కొంచెం నొప్పిగా ఉంద‌న్నారు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్‌కు సాధార‌ణ ప‌రీక్ష‌ల‌తో పాటు ప్రివెంటివ్ చెక‌ప్ కింద మ‌రికొన్ని ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని డాక్ట‌ర్ ఎంవీ రావు తెలిపారు. కేసీఆర్‌కు సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ ప‌రీక్ష‌లు చేశామ‌న్నారు. ప్ర‌స్తుతం సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని ఎంవీ రావు స్ప‌ష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+