విషాదం: కూతుళ్లకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య(పిక్చర్స్)

హైదరాబాద్: కూతుళ్లిద్దరికి విషమిచ్చిన ఓ తండ్రి తానూ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అప్పుల బాధతోనే ఈ అఘాయిత్యం చేసుకునట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్ పట్టణానికి చెందిన బాగోజు రవీంద్రచారి(38)కి మేడ్చల్‌కు చెందిన రాధికతో 12ఏళ్ల క్రితం వివాహమైంది. భార్యాభర్తలిద్దరూ నగరానికి వలస వచ్చి నగర శివారు కుత్బుల్లాపూర్ పట్టణ పరిధిలోని సూరారం కాలనీ చివరి బస్టాప్ వద్ద అద్దెకుంటున్నారు.

అదే కాలనీలో ఆభరణాల దుకాణం నిర్వహిస్తున్నారు. వీరికి జయశ్రీ, అపర్ణ(9), కూతుళ్లతో పాటు మూడేళ్ల కొడుకు నాగశౌర్య ఉన్నారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో జయశ్రీ నాలుగో తరగతి చదువుతుండగా, అపర్ణ మూడో తరగతి చదువుతోంది. రెండేళ్లుగా రవీంద్రచారి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు.

సుమారు రూ.2లక్షల వరకు అప్పు చేశాడు. వాటిని తీర్చేందుకు తెలిసిన వారి వద్ద సర్దుబాటుకోసం ఎంత ప్రయత్నించినా వీలుకాలేదు. ఈ వేదనతో మద్యానికి బానిసయ్యాడు. చివరికి ఇంటి అద్దె, షాపు అద్దె చెల్లించలేని దుస్థితికి చేరుకున్నాడు. తన జీవితాన్ని భారంగా భావించిన ఆయన కూతుళ్లిద్దరికి విషమిచ్చి తనూ చనిపోవాలని నిర్ణయించుకున్నాడు.

గురువారం ఉదయం షాపుకెళ్లి పాల ప్యాకెట్ తీసుకురమ్మంటూ భార్య రాధికకు చెప్పాడు. ఆమె కొడుకును తీసుకొని బయటికెళ్లింది. వెంటనే పాఠశాలకు వెళ్లేందుకు సిద్ధమైన కూతుళ్లిద్దరికి విషం కలిపిన నీళ్లు ఇచ్చి తానూ తాగాడు. భార్య వచ్చేలోగా రవీంద్రచారి విగత జీవిగా పడివున్నాడు. షాక్‌కు గురైన ఆమె చుట్టుపక్కల వారిని పిలిచింది.

స్పృహతప్పి పడిపోయిన అపర్ణను స్థానికులు గాంధీ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. పెద్దకూతురు జయశ్రీ మల్లారెడ్డి వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రవీంద్రచారి, అపర్ణల మరణంతో ఆ కుటుంబంలో విషాదంలో మునిగిపోయింది.

అపర్ణ

అపర్ణ

కూతుళ్లిద్దరికి విషమిచ్చిన ఓ తండ్రి తానూ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఈ ఘటన గురువారం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అప్పుల బాధతోనే ఈ అఘాయిత్యం చేసుకునట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

రవీంద్రాచారి

రవీంద్రాచారి

మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్ పట్టణానికి చెందిన బాగోజు రవీంద్రచారి(38)కి మేడ్చల్‌కు చెందిన రాధికతో 12ఏళ్ల క్రితం వివాహమైంది. భార్యాభర్తలిద్దరూ నగరానికి వలస వచ్చి నగర శివారు కుత్బుల్లాపూర్ పట్టణ పరిధిలోని సూరారం కాలనీ చివరి బస్టాప్ వద్ద అద్దెకుంటున్నారు.

విషాదంలో కుటుంబం

విషాదంలో కుటుంబం

అదే కాలనీలో ఆభరణాల దుకాణం నిర్వహిస్తున్నారు. వీరికి జయశ్రీ, అపర్ణ(8), కూతుళ్లతో పాటు మూడేళ్ల కొడుకు నాగశౌర్య ఉన్నారు.

రవీంద్రాచారి

రవీంద్రాచారి

స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో జయశ్రీ నాలుగో తరగతి చదువుతుండగా, అపర్ణ మూడో తరగతి చదువుతోంది. రెండేళ్లుగా రవీంద్రచారి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+