యాదాద్రి కొండపై అగ్ని ప్రమాదం .. చలువ పందిళ్ళు దగ్ధం
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి కొండపై యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామీ దేవస్థానం వద్ద అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు నిప్పంటుకుని దేవస్థానానికి ముందు వేసిన చలువ పందిళ్లు దగ్ధమయ్యాయి.

ఎండాకాలం కావటంతో త్వరగా మంటలు వ్యాపించాయి. ఒకేసారి మంటలు వ్యాపించటంతో అక్కడ షాపులు నిర్వహిస్తున్న వారు , భక్తులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిప్రమాదం జరగడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు.
స్థానికులు నీళ్ళు పోసి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అంతే కాకుండా సమయానికి అగ్నిమాపక సిబ్బంది ప్రమాద ప్రాంతానికి చేరుకొని మంటలను అదుపుచేయడంతో భారీప్రమాదం తప్పింది. ఈ అగ్ని ప్రమాదంలో చలువ పందిళ్ళు మాత్రమే దగ్ధం అయ్యాయి. ఎలాంటి ఆస్థి నష్టం కానీ ఎవరికి ఎలాంటి హాని కానీ జరగలేదు .












Click it and Unblock the Notifications