స్కూటీపై వచ్చి రోడ్డుపై నిప్పంటించుకొని యువతి ఆత్మహత్య
నల్గొండ/హైదరాబాద్: నల్గొండ జిల్లా భువనగిరి మండలంలోని అనాజీపురం అండర్‌పాస్ వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. తాను వచ్చిన స్కూటీ వాహనంలోని పెట్రోలునే ఒంటిపై పోసుకొని నిప్పంటించుకొని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
ఘటనాస్థలిలో లభ్యమైన ఆధారాల మేరకు హైదరాబాద్‌లోని జియాగూడ ఆసీఫ్‌నగర్‌కు చెందిన ఓజే శ్వేత(29)గా గుర్తించారు. ఆమె తన స్కూటీపై వచ్చి అనాజిపురం అండర్‌పాస్ వద్ద ఆత్మహత్యకు పాల్పడింది.

వాహనంలోని పెట్రోల్ తీసుకొని ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సెల్‌ఫోన్, ఆధార్ కార్డు తదితర వస్తువులు సీటు కింద డిక్కీలో లభ్యమయ్యాయి.
మంటలతో అటూ ఇటూ పరుగెడుతుండగా చుట్టుపక్కల రైతులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకునేలోపు ఆమె శరీరం పూర్తిగా కాలిపోయి మృతి చెందారు. మృతికి కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications