దారుణం: ఇంట్లోకి పిలిచి యువతిపై వీఆర్ఓ, మరో ముగ్గురు గ్యాంగ్‌రేప్
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో విఆర్ఓతోపాటు అతని ముగ్గురు స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
మార్చి నెలలలో జరిగిన ఈ దారుణం ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముచ్చింతల్ గ్రామానికి చెందిన ఆ వికలాంగ యువతి(23) ఇంటి వద్దనే ఉంటోంది.
కాగా, పొరుగింట్లో ఉండే వీఆర్వో చంద్రమోహన్ తోపాటు అదే గ్రామానికి చెందిన మహేందర్, శేఖర్, ఓ తోటలో పనిచేసే జిత్తు అనే యువకులు తనపై అత్యాచారం చేశారని యువతి రెండు రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించింది.

మార్చి నెలలో చంద్రమోహన్ తన ఇంట్లోకి పిలిచాడని, ఇంట్లోకి వెళ్లిన తనపై నలుగురూ కలిసి లైంగిక దాడికి పాల్పడ్డారని తెలిపింది. ఆ తర్వాత స్నానం చేయించి తనను బయటికి పంపించేశారని చెప్పింది. దీంతో పోలీసులు అనుమానితులను అదే రోజు పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించారు.
బాధితురాలి నుంచి ఆదివారం వరకు రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదూ అందకపోవడంతో పోలీసులు దర్యాప్తును కొనసాగించలేదు. ఆదివారం సాయంత్రం పోలీస్ స్టేషన్‌కు వచ్చి రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలికి మతిస్థిమితం సరిగా లేదని, ఆమె మానసిక వికలాంగురాలని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications