వంద మందిని మోసం చేసిన యువతి అరెస్ట్: రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య
హైదరాబాద్: మ్యారేజ్ బ్యూరో పేరుతో ఓ యువతి భారీ మోసానికి పాల్పడింది. అంబర్‌పేటకు చెందిన సరిత అనే యువతి మ్యారేజ్ బ్యూరో పేరుతో వంద మందిని మోసం చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న.. సీసీఎస్ పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కరీంనగర్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య
కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల మండలం చెల్‌గల్ బస్టాండ్ సమీపంలో పట్టపగలు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు.
కారులో వెళ్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి రాకేష్‌ను కొందరు దుండగులు అడ్డుకుని కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసి హతమార్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

లారీ ఢీకొట్టిన ఘటనలో మరో వ్యక్తి మృతి
కరీంనగర్: పత్తిలోడ్‌తో వెళ్తున్న లారీని ఆపేందుకు యత్నించిన చెక్‌పోస్టు సిబ్బందిని లారీతో ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సెక్యూరిటీ గార్డు కొండయ్య మృతిచెందాడు.
బుధవారం ఉదయం జరిగిన ఈ సంఘటనలో ఘటనాస్థలంలోనే మార్కెట్ జూనియర్ కార్యదర్శి నరేందర్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
కరీంనగర్ హైవేపై గల చెక్‌పోస్టు వద్ద లారీని ఆపేందుకు యత్నించగా డ్రైవర్ ఆపకుండా ఉడాయించాడు. పట్టుకునేందుకు ద్విచక్ర వాహనంపై చెక్‌పోస్టు సిబ్బంది వెళ్లగా లారీతో ఢీకొట్టాడు.












Click it and Unblock the Notifications