ఏమిటీ ఘోరం.. 73 సార్లు కత్తితో పొడిచి తాతను చంపి.. అడ్డొచ్చిన తల్లిపై 12 సార్లు..

రాను రాను మనుషుల్లో మానవత్వం నశించిపోతోంది. చిన్నవయసులోనే యువత తప్పదారి పడతున్నారు. బంధువులు, బాంధవ్యాలు మరిచిపోయి క్రూరంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి ఓ అమానవీయ ఘటనే హైదరాబాద్ లో జరిగింది. మిగతా మనవళ్ల లాగ తనను చూడట్లేదన్న కసితో ఓ యువకుడు తన తాతను కిరాతకంగా హతమార్చాడు. ఏకంగా 73 సార్లు కత్తితో పొడిచి పగతీర్చుకున్నాడు. తాతను కిరాతకంగా చంపి తప్పించుకుని తిరుగుతున్న ఆ యువకుడిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ లోని సోమాజిగూడలో నివాసం ఉంటున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త వెల్జాన్‌ గ్రూపు సంస్థల అధినేత వీసీ జనార్దనరావు (86)ను ఈ నెల ఆరో తేదీన మనవడు కిలారు కీర్తి తేజ(29) కిరాతకంగా హతమార్చాడు. 73 సార్లు జనార్థనరావుని కత్తితో దారుణంగా చంపాడు తేజ. అడ్డు వచ్చిన తల్లిపైనా దాడికి పాల్పడ్డాడు. మిగతా మనవళ్లను చూసినట్లు తనను చూడలేదన్న కసితో హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

a grandson stabbed 73 times his grandfather to death over asset issues

పోలీసుల కథనం ప్రకారం.." ఆస్తికోసం గత కొంత కాలంగా జనార్థన రావు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాతపై మనువడు కీర్తి తేజ పగను పెంచుకున్నాడు. ఈ కారణంగానే హత్య చేశాడు. తేజకు కంపెనీలో డైరెక్టర్ పోస్టు ఇవ్వకపోవడమూ ఓ కారణంగా తెలుస్తోంది. ఇటీవల కంపెనీలో ఒక మనవడికి డైరెక్టర్ పోస్ట్‌ను జనార్థన రావు ఇచ్చాడు. తనకు కూడా డైరెక్టర్ పోస్టు కావాలని కీర్తి తేజ తాతను డిమాండ్ చేశాడు. అమెరికాలో ఉండి ఇటీవలే హైదరాబాద్‌కు కీర్తి తేజ వచ్చాడు. కీర్తి తేజ చెడు వ్యసనాలను చూసి డైరెక్టర్ పోస్టును జనార్థన రావు ఇవ్వలేదు. డైరెక్టర్ పోస్ట్ ఇవ్వకపోవడంతో 73 సార్లు కసితో కీర్తి తేజ తాతను చంపాడు" అని పోలీసులు తెలిపారు.

అడ్డు వచ్చిన తల్లిపై 12 సార్లు..

తాతను చంపుతుంటే అడ్డం వచ్చిన తల్లిపై 12సార్లు కత్తితో కీర్తి తేజ పొడిచాడు.తల్లి అరుపులు విని స్థానికులు ఇంటికి వచ్చారు. అప్పటికే జనార్థన రావు చనిపోగా తీవ్ర గాయాలతో కీర్తి తేజ తల్లి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆమెను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ దాడికి పాల్పడ్డ కీర్తి తేజ ఏలూరుకు పారిపోయాడు. అతడ్ని ఏలూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+