హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Private Hospitals: 10 రోజులకు అరకోటికి పైగా బిల్లు.. రోగికి షాకిచ్చిన ప్రైవేట్ ఆస్పత్రి..

ప్రైవేట్ ఆస్పత్రుల బిల్లులు చూసి చాలా మందికి గుండె గుబిల్లుమంటుంది. తాజాగా ఓ ఆస్పత్రి 10 రోజులకు రూ.54 బిల్లు వేసింది.

|
Google Oneindia TeluguNews

ప్రస్తుతం విద్య, వైద్యం చాలా ఖరీదుగా మారాయి. ఎంతగా పెరిగాయంటే.. ఆస్పత్రి బిల్లు చెల్లించడానికి ఆస్తులు కూడా అమ్ముకునే వరకు చేరాయి. గుండెపోటు వచ్చి ఆస్పత్రికి వెళ్తే బిల్లు చూసి మరోసారి గుండె పోటు వచ్చేలా ఉంది. తాజాగా ఓ వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేసిన బిల్లు రిసిట్ చూసి చాలా మంది షాకయ్యారు. మజ్లిస్ బచావో తెహ్రీక్ (MBT) ప్రతినిధి అమ్జెద్ ఉల్లా ఖాన్ షేర్ చేసిన ఆసుపత్రి బిల్లు ప్రకారం, హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో 10 రోజుల చికిత్స కోసం సయ్యద్ రహ్మత్ ఉద్దీన్ అనే రోగికి 54 లక్షలు వసూలు చేశారు.

రూ.20 లక్షలు

రూ.20 లక్షలు


రోగి కుటుంబ సభ్యులు ఇప్పటివరకు రూ.20 లక్షలు చెల్లించారని ఖాన్ పేర్కొన్నారు. మరో ట్వీట్‌లో, ఆసుపత్రి ఇంకా రూ. 29 లక్షలు డిమాండ్ చేస్తుందని పేర్కొన్న ఖాన్, రోగిని గాంధీ లేదా నిమ్స్ ఆసుపత్రికి తరలించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. ప్రైవేట్ ఆస్పత్రులు భారీగా బిల్లులు వసూలు చేయడం ఇదేమి కొత్త కాదు.

కరోనా

కరోనా

కరోనా సమయంలో హైదరాబాద్‌లోని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు COVID చికిత్స కోసం భారీగా బిల్లులు వసూలు చేశాయి. దీనిపై అప్పట్లో కొంత మంది కోర్టుకు కూడా వెళ్లారు. ఆ తర్వాత తెలంగాణ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ కోవిడ్ చికిత్స సమయంలో ఎక్కువ వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇవ్వాలని 44 ప్రైవేట్ ఆసుపత్రులను కోరింది.
44 ఆస్పత్రులు

44 ఆస్పత్రులు


ఈ 44 ఆస్పత్రుల్లో నాలుగు ఆసుపత్రులు ఒక్కొక్కటి 10 లక్షలకు పైగా తిరిగి ఇచ్చాయి. ఎనిమిది ఆసుపత్రులు దాదాపు రూ. 5 నుంచి 10 లక్షలు ఇచ్చాయి. ఐదు ఆసుపత్రులు రూ. 3.2 లక్షల నుంచి రూ. 399440 వరకు ఉన్న మొత్తాలను తిరిగి ఇచ్చాయని సమాచార హక్కు చట్ట ప్రకారం తెలిసింది. జూన్ 22, 2021 నాటికి రోగులకు మొత్తం రూ.1,61,22,484 తిరిగి ఇచ్చారు.

వైద్య ఖర్చులు

వైద్య ఖర్చులు

సాధారణంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు వైద్య ఖర్చులకు భయపడి హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రులను వెళ్లేందుకు వెనుకాడుతున్నారు. ఎలాంటి ఆరోగ్య బీమా లేనివారికి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఖర్చు తడిసి మోపెడు అవుతోంది.


English summary
Nowadays, education and healthcare have become very expensive. It has increased so much that even the property has been sold to pay the hospital bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X