నిద్రిస్తుండగానే టెక్కీ ఇల్లు గుల్ల చేశారు: 20తులాల బంగారం, 60వేల నగదు చోరీ(పిక్చర్స్)
హైదరాబాద్: ఓ ఇంట్లో కుటుంబ సభ్యులంతా నిద్రిస్తూండగానే రాత్రికి రాత్రే ఇల్లు గుల్ల చేశారు దొంగలు. ఈ ఘటన నగరంలోని బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాంగోపాల్ ఎన్‌క్లేవ్‌లో భాస్కరన్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నివసిస్తున్నాడు.
మంగళవారం రాత్రి భోజనం చేసిన అనంతరం భాస్కరన్ కుటుంబసభ్యులతో ఇంట్లోని ఓ గదిలో నిద్రపోయాడు. బుధవారం ఉదయం నిద్రలేచి మరో గదిలోకి వచ్చి చూడగానే కిటికి గ్రిల్స్ తెరిచి ఉన్నాయి. గదిలోని వస్తువులు కూడా చిందర వందరగా పడి ఉన్నాయి.
బీరువాలో దాచిన విలువైన వస్తువులు కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు. అదనపు ఇన్‌స్పెక్టర్ లక్ష్మన్‌రాజు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
తన ఇంట్లో నుంచి దాదాపు 2.50 లక్షల విలువైన 20 తులాల బంగారు అభరణాలు, రూ.60 వేల నగదు కన్పించడంలేదని భాస్కరన్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న బోయిన్‌పల్లి పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

చోరీ జరిగిన ఇల్లు
ఓ ఇంట్లో కుటుంబ సభ్యులంతా నిద్రిస్తూండగానే రాత్రికి రాత్రే ఇల్లు గుల్ల చేశారు దొంగలు. ఈ ఘటన నగరంలోని బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసుల దర్యాప్తు
పోలీసుల కథనం ప్రకారం.. రాంగోపాల్ ఎన్‌క్లేవ్‌లో భాస్కరన్ అనే వ్యాపారి నివసిస్తున్నాడు.

దొంగల బీభత్సం
మంగళవారం రాత్రి భోజనం చేసిన అనంతరం భాస్కరన్ కుటుంబసభ్యులతో ఇంట్లోని ఓ గదిలో నిద్రపోయాడు.

దొంగల బీభత్సం
బుధవారం ఉదయం నిద్రలేచి మరో గదిలోకి వచ్చి చూడగానే కిటికి గ్రిల్స్ తెరిచి ఉన్నాయి. గదిలోని వస్తువులు కూడా చిందర వందరగా పడి ఉన్నాయి.












Click it and Unblock the Notifications