వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లిఫ్టు కూలి మహిళ మృతి, మరో ఇద్దరికి గాయాలు నిర్లక్ష్యమే కారణమా?

నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో లిప్టు కూలి ఓ మహిళ మరణించింది . ఈ ఘటన హైద్రాబాద్ లోచోటుచేసుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో లిప్టు కూలి ఓ మహిళ మరణించింది . ఈ ఘటన హైద్రాబాద్ లోచోటుచేసుకొంది.

భవన నిర్మాణ సమయాల్లో కాంట్రాక్టర్లు కనీస నిబంధనలను పాటించడం లేదు.కనీస రక్షణ చర్యలు పాటించని కారణంగా కార్మికులు ప్రమాదాలకు గురౌతున్నారు.

భవన నిర్మాణ సమయాల్లో కనీస ప్రమాణాలను పాటించాలనే నిబంధనలను కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదు. అనేక మంది భవన నిర్మాణ కార్మికులు మరణిస్తోన్నా పట్టించుకోవడం లేదు.

కార్మిక శాఖ కూడ కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. ప్రమాదాలు జరిగిన సమయంలొ మినహ ఇతర సమయాల్లో చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తోంది.

లిప్టు ప్రమాదంలో మహిళ మృతి

లిప్టు ప్రమాదంలో మహిళ మృతి

బండ్ల గూడలోని ఇంద్రప్రస్థ కాలనీలో విషాదం చోటుచేసుకొంది. నిర్మాణంలో ఉన్న అపార్ట్ మెంట్ లిఫ్టు కూలి మీద పడడంతో ఓ మహిళ మరణించింది. ఈ ఘటనలో మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి.

కనీస చర్యలు తీసుకోని కాంట్రాక్టర్లు

కనీస చర్యలు తీసుకోని కాంట్రాక్టర్లు

భవన నిర్మాణ సమయాల్లో పనిచేసే కార్మికులకు కనీస రక్షణ చర్యలు తీసుకోవడం లేదు.దీంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకొంటున్నాయి. ఈ ప్రమాదాల నివారణకు గాను ముందుజాగ్రత్తలు కూడ తీసుకోవడం లేదు.

నిర్లక్ష్యంగా కట్టడాలు

నిర్లక్ష్యంగా కట్టడాలు

హైద్రాబాద్ లో నగరంలో రియల్ ఏస్టేట్ బాగా వృద్ది చెందింది.దీంతో భవన నిర్మాణాలు పెరిగిపోయాయి . నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు కాంట్రాక్టర్లు కనీస రక్షణ చర్యలు తీసుకోవడం లేదు. వేగంగా నిర్మాణ పనులు జరిగేలా చర్యలు తీసుకొంటున్నారు. కాని పనిచేసే కార్మికులకు తరచూ ప్రమాదాలకు గురౌతున్నారు.

కార్మికశాఖ మౌనం

కార్మికశాఖ మౌనం

భవన నిర్మాణ సమయంలో కార్మికులు ప్రమాదాలకు గురౌతోన్నా కార్మికశాఖ పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తోంది. ఈ ప్రమాదానికి కారణమైన కాంట్రాక్టర్లతో పాటు, భవన యజమానులపై చర్యలు తీసుకోవడం లేదు. నామమాత్రంగా కేసులు బనాయించి వదిలేస్తున్నారు.దీంతో ప్రమాదాలు గురైన సమయంలో కార్మికశాఖ హడావుడి చేస్తోంది .ఇతర సమయాల్లో మాత్రం చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తోంది.

English summary
a lady died in lift accident at bandlguda on monday,another two members serious injured this incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X