భార్య కాపురానికి రాలేదని.. ఉరేసుకుని భర్త ఆత్మహత్య

మహబూబ్‌నగర్: తనతో గొడవపడి పుట్టింటికి వెళ్లిన భార్య.. తిరిగి రాలేదని మనస్తాపం చెందిన ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొల్చారం మండలం పైతర గ్రామంలో సోమవారం వెలుగుచూసింది.

మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్మరి జయరాం(32), సురేఖ దంపతులకు అక్షయ, శైలజ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. జయరాం వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

కాగా, ఆరు నెలల క్రితం భర్తతో గొడవపడి సురేఖ పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి జయరాం ఒంటరిగానే ఉంటున్నాడు. ఆరు నెలలు గడుస్తున్నా భార్య తిరిగి రాకపోవడంతో ఆదివారం రాత్రి ఇంట్లోనే చీరతో ఉరి వేసుకున్నాడు.

A man allegedly committed suicide for his wife

మరో ఇంట్లో ఉంటున్న అతని తల్లి దుర్గమ్మ సోమవారం ఉదయం వెళ్లి చూడగా అతడు ఉరివేసుకుని కనిపించాడు. దీంతో అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు..

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం

ఇటిక్యాల మండం కోడేరులో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు మగ పిల్లలతో సహా తల్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. విషయాన్ని గమనించిన స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+