రూ.20 కోసం హత్య: తల్లి మృతితో ఆగిన గుండె

నల్గొండ/హైదరాబాద్: జిల్లాలోని కోదాడ మండలంలో దారుణం చోటు చేసుకుంది. 20 రూపాయల కోసం ఓ యువకుడు తన స్నేహితుడ్ని హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. కోదాడ మండలంలోని మంగలి తాండాకి చెందిన నాగేశ్వరరావు(50), జిత్తు(27) స్నేహితులు.

తన జేబులో ఉన్న 20 రూపాయలను జిత్తు అడక్కుండా తీసుకున్నందుకు నాగేశ్వరరావుకి కోపం వచ్చింది. దీంతో అతను నడుచుకుంటూ వెళ్తుండగా జిత్తును వెనుక నుంచి వెళ్లి కర్రతో తలపై బాదాడు. దీంతో జిత్తు అక్కడికక్కడే మరణించాడు. ఆ తర్వాత నాగేశ్వరరావు పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

A man allegedly murdered by his friend

తల్లి మృతితో ఆగిన కొడుకు గుండె

కన్నతల్లి కన్ను మూసిందన్న వార్త ఓ కుమారుడిని కలిచివేసింది. తల్లి మరణించిందనే వార్తతో అతని గుండె కొట్టుకోవడం ఆపేసింది. ఈ విషాధ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో ఆదివారం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. జడ్చర్ల మండలం గొల్లపల్లిలో నివాసముండే నాగమ్మ(85) ఆదివారం ఉదయం మృతి చెందింది. షాద్‌నగర్‌లో నివాసముండే ఆమె కుమారుడు, విశ్రాంత ఏఎస్సై(61)కి ఈ వియం తెలియవచ్చింది. దీంతో తల్లిని తలచుకుంటూ రోదిస్తూ స్నానాల గదిలోకి వెళ్లిన భీంరెడ్డి అక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆస్పత్రి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

రసాయన పరిశ్రమలో పేలుడు

కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌లోని ఎమ్మార్ ల్యాబొరేటరీ ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో సోమవారం పేలుడు సంభవించింది. విద్యుదాఘాతం కారణంగా పరిశ్రమలోని డ్రయ్యర్ పేలిపోయింది. పేలుడు ధాటికి భవనం ధ్వంసమైంది. సెలవు రోజు కావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

కొడుకులతో పాటు విషయం తాగిన తల్లి

ఖమ్మం: జిల్లాలోని చింతూరు మండలం నర్సింగపేటలో విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు కుమారులతో కలిసి విషం తాగి ఆత్మయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ఓ కొడుకు మృతి చెందగా, తల్లి, మరో కొడుకు పరిస్థితి విషమంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+