భార్యపై అనుమానం: కొడుకుని చెరువులో తొక్కిపెట్టి..
వరంగల్: జిల్లాలోని పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలో దీపావళి పండగ రోజున దారుణ ఘటన చోటు చేసుకుంది. వల్మిడి గ్రామానికి చెందిన మహంకాళి అంజయ్య తన భార్యపై అనుమానంతో కుమారుడిని దారుణంగా హత్య చేశాడు.
భార్యపై అనుమానం పెంచుకున్న అంజయ్య, తన ఇద్దరు కుమారుల్ని బుధవారం రాత్రి గ్రామ సమీపంలోని చెరువు వద్దకు తీసుకెళ్లాడు. చిన్న కుమారుడు కమల్(4)ను చెరువులో పడేసి కాళ్లతో తొక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం రెండో కుమారుడిని తీసుకుని పరారయ్యాడు.
గురువారం ఉదయం స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పాలకుర్తి పోలీసులు అంజయ్య, అతని రెండో కుమారుడ్ని వల్మిడి శివారులో అదుపులోకి తీసుకున్నారు. భార్యపై అనుమానంతోనే అంజయ్య ఈ హత్య చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తిప్పారెడ్డిపల్లి సర్పంచ్ భర్త దారుణ హత్య
మహబూబ్‌నగర్: జిల్లాలోని వంగూరు మండలంలోని తిప్పారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ అలివేలు భర్త తిరుపతయ్య(36) గురువారం తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యాడు. ద్విచక్రవాహనంపై వ్యవసాయ పొలం వద్దకు వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు కాపుకాసి గొడ్డళ్లతో నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రెడ్డి బీడి యజమాని మృతి
మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంటకు చెందిన రెడ్డి బీడీ యజమాని ఎస్ గోపాలరెడ్డి(95) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన గతకొంత కాలంగా అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి మృతి చెందినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications