గంజాయి సిగరెట్ తాగించి యువతిపై అత్యాచారం చేశాడు

హైదరాబాద్‌ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సిగరెట్‌లో గంజాయి కలిపి ఓ యువతి(25)పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

హైదరాబాద్‌: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సిగరెట్‌లో గంజాయి కలిపి ఓ యువతి(25)పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

నిందితుడు ఆమెకు స్నేహితుడేనని, ఆ యువతికి మత్తుమందు అలవాటు చేసి ఈ దురాగతానికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. బాధితురాలు అస్వస్థతకు గురవడంతో ఈ విషయం బహిర్గతమైంది. మాదాపూర్‌లోని ఓ ప్రభుత్వరంగసంస్థలో పనిచేస్తున్న యువతికి నిందితుడు మూడేళ్ల క్రితం పరిచయమయ్యాడు.

A man allegedly raped girl in Madhapur

ప్రేమిస్తున్నానని చెప్పి యువతికి మత్తుమందు అలవాటు చేశాడు. తరచూ సిగరెట్‌లో గంజాయి కలిపి ఇచ్చి తాగించేవాడు. ఈ క్రమంలో నగరంలోని ఓ సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. వారం క్రితం బాధితురాలు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైంది. తల్లి ఆరా తీయడంతో బాధిత యువతి జరిగిన విషయం చెప్పింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దోపిడీ దొంగల అరెస్ట్

హైదరాబాద్ నగరంలో ఇద్దరు అంతర్‌ర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం అల్వాల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలానగర్ డీసీపీ సాయిశేఖర్ నిందితుల వివరాలు వెల్లడించారు. ఉండవల్లి వెంక టేశ్వర్‌రావు, అలియాస్ వెంకటేశ్, వెంకన్న (34) బతుకుదెరువు కోసం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ నుంచి వచ్చి కుత్బుల్లాపూర్ రామలక్ష్మి కాలనీ జీడిమెట్లలో నివాసం ఉంటున్నాడు. కోటిపల్లి శ్రీనివాస్(37) జీడిమెట్లలోని ఎంఐజీ కాలనీలో ఉం టూ నేరాలకు పాల్పడేవారు.

బుధవారం సాయం త్రం ఓల్డ్ అల్వాల్ లయోలా అకాడమీ రోడ్డులో ఎస్సై కె. రమేష్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా నంబర్ ప్లేట్ లేని ద్విచక్రవాహనంపై వస్తున్న ఇద్దరు వెనుకకు తిరిగి పారిపోవాడానికి ప్రయత్నిస్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు వెంబడించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం విచారించగా పాత నేరస్తులుగా తేలింది అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 8, పేట్ బషీరాబాద్‌లో 2, జీడీమెట్లా పరిధిలో 3, మొత్తం 13 దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. వారివద్ద నుంచి 195 గ్రాముల బంగారు ఆభారణాలు, 3.6 కేజీల వెండి ఆభరణాలు, 5 ల్యాప్‌ట్యాప్‌లు, 1 హోండాషైని మోటర్‌సైకిల్ మొత్తం 8,75,000 వేల విలువగల వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+