పైశాచికం: భార్య మర్మాంగంలో జీడి పోసిన భర్త, సహకరించిన అత్తామామలు
మెదక్: జిల్లాలోని కౌడిపల్లి మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యనే తీవ్ర క్షోభకు గురిచేశాడు ఓ ప్రబుద్ధుడు. మాటలతో నిత్యం వేధించటమే కాకుండా నిద్రిస్తున్న ఆమెపట్ల రాక్షసంగా ప్రవర్తించాడు.
అమానవీయమైన ఈ సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ పరిధి మందిర్ తండాలో జరిగింది. మందిర్ తండాకు చెందిన మహిళ(22)కు స్థానికుడైన మదన్‌తో తొమ్మిది నెలల క్రితం వివాహం జరిగింది.
పెళ్లి సమయంలో రూ.3 లక్షలు కట్నకానుకలను పుచ్చుకున్న మదన్ ఆ తర్వాత మరో రూ.5 లక్షలు తీసుకురావాలని భార్యను వేధించసాగాడు. మార్చి 15 రాత్రి భార్య నిద్రిస్తుండగా తన తండ్రి, తల్లి తోడ్పాడుతో ఆమె చేతులు, కాళ్లు పట్టుకొని జననాంగంలో జీడి పోశాడు.

వైద్యుల సమాచారం, బాధితురాలి వాంగ్మూలంతో పోలీసులు.. ఆమె భర్త, మామ, అత్తపై వరకట్న వేధింపు కేసు నమోదు చేశారు.
గురువారం ఏఎస్‌ఐ ఖలీమొద్ధిన్ తెలిపిన వివరాల ప్రకారం.. భవానీమందిర్ తండాకు చెందిన వివాహిత (20)ని కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె భర్త మదన్ ధరావత్, అత్త చెన్నభాయ్, మామ పాండులు పలుమార్లు వేధించారు.
ఈ విషయమై గతంలో తండాలో పంచాయితీలు సైతం నిర్వహించారు. మార్చి 15న రాత్రి బాధితురాలు నిద్రిస్తుండగా అత్త, మామ పట్టుకోగా భర్త జీడిపోసినట్లు ఏఎస్‌ఐ తెలిపారు. తీవ్రగాయం కావడంతో గురువారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. బాధితురాలు నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.












Click it and Unblock the Notifications