ఈదురు గాలుల బీభత్సం, ఎల్బీ స్టేడియంలో కుప్పకూలిన ఫ్లడ్ లైట్ టవర్, ఒకరి మృతి,
గత రెండు మూడు రోజులుగా అతలాకుతలం చేస్తున్న ఈదురు గాలులో నేడు హైద్రబాద్ లోమరోసారి తమ ప్రతాపాన్ని చూపించింది. సుమారు గంటపాటు మెరుపులు ఉరుములతో కూడిన వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫర సైతం నిలిచిపోయింది.

ఈనేపథ్యంలోనే గాలుల ధాటికి ఎల్బీ స్టేడీయంలో ప్లడ్ లైట్ టవర్ సైతం కూలిపోయింది. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందారు. కాగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఇక ఇదురు గాలులకు పలుచోట్ల రహదారులకు అడ్డంగా చెట్లు విరిగిపడ్డాయి. దీంతో ట్రాఫిక్ కు సైతం అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలులకు ,నగరంలోని మాసబ్ ట్యాంక్, లక్డికపూల్ తోపాటు పలు ప్రాంతాల్లో హోర్డీంగ్ లు కూలిపోయాయి.












Click it and Unblock the Notifications