గర్ల్‌ఫ్రెండ్‌తో ఎఫ్‌బీ చాటింగ్?: భర్తతో గొడవ పడి యువతి ఆత్మహత్య
వరంగల్: సోషల్ మీడియా ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నప్పటికీ.. పలువురి మరణాలకు కూడా కారణం కావడం విచారకరం. తాజాగా, అలాంటి ఘటనే ఒకటి వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఫేస్‌బుక్ చాటింగ్ పచ్చని కాపురంలో చిచ్చుపెట్టి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.
వివరాల్లోకి వెళితే.. హన్మకొండలోని ఎస్‌బీహెచ్ కాలనీలో నివసించే భరత్‌కుమార్, గద్దల సంగీత (23)ది ప్రేమ వివాహం. కాగా, భరత్.. కాజీపేటలోని విద్యుత్ కార్యాలయంలో సబ్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు.
శుక్రవారం సాయంత్రం ఫేస్‌బుక్‌లో భర్త అమ్మాయిలతో చాటింగ్ చేయడం చూసిన సంగీత గర్ల్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నావంటూ గొడవకు దిగింది. ఆ తర్వాత సద్దుమణిగింది. కాగా, శనివారం భర్త విధులకు వెళ్లగానే.. బెడ్‌రూంలో ఉరివేసుకుంది సంగీత.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. భరతకుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, తాను చిన్ననాటి స్నేహితులతో చాటింగ్ చేశానని, తన భార్యకు ఇదే విషయం చెప్పి నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగిందని భరత్ కుమార్ చెప్పాడు. అయినా, ఆమె ఇలా చేస్తుందని తాను ఊహించలేదని తెలిపాడు.
దారుణం: భర్తను నరికి చంపిన భార్య
ఓ వివాహిత మహిళ కట్టుకున్న భర్తనే అత్యంత దారుణంగా కత్తితో నరికి చంపింది. ఈ ఘటన కొమ్ములవంచ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. తొర్రూరు సీఐ శ్రీధర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన డొనికెన రంగయ్య(40)కు 20ఏళ్ల కిత్రం మానుకోట మండలం తాళ్ల పూసపల్లి గ్రామానికి చెందిన విజయతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు రాకేశ్, దినేశ్ ఉన్నారు.
రంగయ్య గీతకార్మిక వృత్తి చేపడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మద్యం మత్తులో రంగయ్య తన భార్య విజయతో గొడవపడ్డాడు. నిద్రకు ఉపక్రమించిన తర్వాత భర్త రంగయ్యను కల్లుగీసే కత్తితో మెడ, గొంతుపై దాడి చేసి హత్య చేసింది.
కత్తిని ఇంటి ముందు ఉన్న చెట్లలో పడేసిన విజయ ఉదయం తన భర్త కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్తులను నమ్మబలికే ప్రయత్నం చేసింది. విషయం తెలునుకున్న తొర్రూరు సీఐ శ్రీధర్‌రావు చేరుకుని ఘటనాస్థలానికి చేరుకుని డాగ్ స్కాడ్, క్లూస్‌టీంతో వేలిముద్రలను సేకరించారు.
మృతుడి సోదరుడు రామ్మూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానిక ఎస్సై నాగేశ్, ట్రైనీ ఎస్సై తిరుపతిరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
-
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!!












Click it and Unblock the Notifications