హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్విస్ట్: ప్రియుడిపై మోజుతో పిన్ని వేధిస్తోందని హెచ్ ఆర్ సి లో తప్పుడు ఫిర్యాదు, తల్లి రాకతో ఇలా

ప్రియుడి మోజులో పడి తల్లిదండ్రులు చనిపోయారని ఓ బాలిక అబద్దాలు చెప్పింది. అంతేకాదు తనను తన పిన్ని చిత్రహింసలు పెడుతోందని అబద్దాలతో హెచ్ ఆర్ సి ఆశ్రయించింది.అయితే పోలీసులు ఈ ఘటనను పోలీసులు ఎట్టకేలకు బ

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:ప్రియుడి మోజులో పడి తల్లిదండ్రులు చనిపోయారంటూ ఆ బాలిక అబద్దాలు చెప్పింది.అంతేకాదు తనను తన పిన్ని చిత్రహింసలు పెడుతోందని అబద్దాలతో హెచ్ ఆర్ సి ని ఆశ్రయించింది. హెచ్ ఆర్ సి బాలికకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది.అయితే సామాజిక మాద్యమాల మోజులో పడి ఓ బాలిక ఈ రకంగా తప్పుడు సమాచారాన్ని ఇచ్చింది.పోలీసుల రంగ ప్రవేశంతో అసలు విషయం వెలుగు చూసింది.

తప్పుడు సమాచారంతో మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించింది ఆ బాలిక. అయితే బాలిక చెప్పిన విషయాలను విన్న హెచ్ ఆర్ సి ఆమెకు రక్షణ కల్పించాలని కూడ ఆదేశించింది.

ఫేస్ బుక్, వాట్సాప్ లాంటి సామాజిక మాథ్యమాల కారణంగా తమ తల్లిదండ్రులే చనిపోయారని ఓ బాలిక అబద్దమాడింది.అంతేకాదు తాను చెప్పే మాటలను సరిపోయేలా కథలను పోలీసులకు హెచ్ ఆర్ సి వద్ద వివరించింది.దీంతో వారంతా నమ్మారు.

కోట్లాది రూపాయాల ఆస్తులున్నాయని, వాటిని కాజేసేందుకు పిన్ని తనను చిత్రహింసలు పెడుతోందని బాలిక పోలీసులను హెచ్ ఆర్ సి ని బురిడీ కొట్టింది. ఈ ఏడాది ఆగష్టులో బాలిక మేజర్ కానుంది. మేజర్ అయ్యే వరకు రక్షణ కల్పించాలని హెచ్ ఆర్ సి ఆదేశించింది.

బెంగుళూరు నుండి హైద్రాబాద్ కు ఇలా

బెంగుళూరు నుండి హైద్రాబాద్ కు ఇలా

బెంగుళూరులో నివసిస్తోన్న మార్బుల్ వ్యాపారి కుమారై 9వ, తరగతి చదువుతోంది. ఏడు నెలల క్రితం సంతోషన్ నగర్ కు చెందిన షోయబ్ ఫేస్ బుక్ ద్వారా బాలికకు పరిచయమయ్యాడు.

అయితే కొద్దిరోజులకే బాలిక అతణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పింది. అప్పటి నుండి ఇద్దరూ కూడ ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా గంటల తరబడి చాటింగ్ చేసేవారు.తల్లిదండ్రులను వదిలేసి వస్తానని బాలిక షోయబ్ కు చెప్పింది. తాను కూడ రమ్మన్నాడు.దీంతో ఆ బాలిక పదిరోజుల క్రితం హైద్రాబాద్ కు వచ్చింది.

ఉదయం షికారు రాత్రి పూట స్నేహితుడి ఇంట్లో

ఉదయం షికారు రాత్రి పూట స్నేహితుడి ఇంట్లో

బెంగుళూరు నుండి వచ్చిన బాలిక ఉదయం పూట తన ప్రియుడు షోయబ్ తో షికారు కొట్టేదిహైద్రాబాద్ నగరంలోని ప్రముఖ పర్యాటక స్థలాలను చూసింది

.సాలార్ జంగ్ మ్యూజియం, పార్కులు , ఇతర పర్యాటక స్థలాలను చూసింది. రాత్రి పూట భవానీ నగర్ లో ఉన్న తన స్నేహితుడు రషీద్ ఇంట్లో షోయబ్ బాలికను ఉంచేవాడు.అయితే మూడో రోజు రషీద్ నిలదీస్తే బాలిక తన తల్లిదండ్రులు చనిపోయారని, పిన్ని చిత్రహింసలు పెడుతోందని కట్టుకథలు చెప్పింది బాలిక.

బాలిక ఆచూకీ కోసం తల్లిదండ్రుల ఫిర్యాదు

బాలిక ఆచూకీ కోసం తల్లిదండ్రుల ఫిర్యాదు

బెంగుళూరు నుండి హైద్రాబాద్ కు బాలిక రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు.

తమ కూతురు ఆచూకీ కోసం వారంతో తీవ్రంగా గాలించారు.కాని వారికి బాలిక ఆచూకీ లభ్యం కాలేదు.అయితే బెంగుళూరు హెబ్బళీ పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

అయితే ఈ ఫిర్యాదు ఆధారంగా బాలిక ఫోన్ పై పోలీసులు నిఘా ఉంచారు. ఈ నిఘా ఆధారంగా హైద్రాబాద్ లో బాలిక ఆచూకీ ఉన్నట్టు ఫోన్ ద్వారా సమాచారం వచ్చింది పోలీసులకు.ఈ నెల 6వ, తేదిన బాలిక హైద్రాబాద్ లో ఉన్న విషయాన్ని బెంగుళూరు పోలీసులు గుర్తించారు.

మానవహక్కుల కమీషన్ లో తప్పుడు ఫిర్యాదు

మానవహక్కుల కమీషన్ లో తప్పుడు ఫిర్యాదు

తాను చెప్పిన కట్టుకథను నిజం చేసేందుకుగాను ఆ బాలిక హెచ్ ఆర్ సి ని ఆశ్రయించింది. న్యాయవాది వద్ద సహయకుడిగా పనిచేసే ఇక్బాల్ కు తన వివషయం వివరిస్తే మంగళవారం నాడు జయ వింద్యాల సహయంతో బాలిక హెచ్ ఆర్ సి లో తప్పుడు ఫిర్యాదు చేసింది.

ఆస్తి కోసం తన పిన్ని తనను చిత్రహింసలు పెడుతోందని చెప్పింది. తన ఉదరబాగంపై ఉన్న మచ్చలను చూపి హెచ్ ఆర్ సి ని నమ్మించింది బాలిక.

బెంగుళూరు పోలీసులు బయటపెట్టారిలా

బెంగుళూరు పోలీసులు బయటపెట్టారిలా

బాలిక హెచ్ ఆర్ సి లో ఫిర్యాదు చేసిన రోజు సాయంత్రమే బెంగుళూరు నుండి బాలిక తల్లి పోలీసులు హైద్రాబాద్ కు చేరుకొన్నారు.

బాలిక ఉపయోగిస్తున్న ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బెంగుళూరు పోలీసులు రషీద్ ఇంటికి చేరుకొన్నారు.అయితే తనకేమీ తెలియదని హెచ్ ఆర్ సి ఫిర్యాదు కోసమే వెళ్ళానని రషీద్ చెప్పాడు

బెంగుళూరు పోలీసులు స్థానిక పోలీసుల సహయం తీసుకొన్నారు.దీంతో అసలు విషయం తెలిసి స్థానిక పోలీసులు షాక్ తిన్నారు.బాలికతో సహ ఆమెకు సహకరించిన ప్రియుడిని అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకొన్నారు.

English summary
a minor gril false complaint in hrc for love. she escaped from banglore 10 days back. parents complaint at hebbal police station in bangalore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X