Narendra Modi: బాల మిత్రుడితో నరేంద్ర మోదీ.. వైరల్ అవుతోన్న ఫొటో..!
ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. బిజీ బిజీగా గడుపుతున్నారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న మోడీ రాజ్ భవన్ లో బస చేశారు. బుధవారం ఉదయం వేములవాడకు వెళ్లారు. రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాతా బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం వరంగల్ కు వెళ్లారు. ఈ క్రమంలోనే ప్రధాని సరదాగా గడుపుతున్నారు.
వరంగల్ ప్రచార ర్యాలీకి వెళ్లే ముందు నరేంద్ర మోదీ ఓ బాలుడిని ఎత్తుకున్నారు. చిన్నోడితో కాస్త ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. " వరంగల్ ర్యాలీకి వెళ్తుండగా లక్ష్మీపురం గ్రామంలో నా యువ మిత్రుడిని కలిశాను" అని తెలుగు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు ప్రధాని గారు మీకు చాలా చిన్న వయస్సు స్నేహితుడు దొరికాడని కామెంట్ చేస్తున్నారు.

అటు ఏపీలో కూడా ప్రధాని మోదీ ప్రచారం చేస్తున్నారు. రాయలసీమలోని చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరిలో జరిగే బహిరంగ సభలో పాల్గొన్నారు. మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్న రాజంపేట నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. అందుకే పీలేరులో సభ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పీలేరు సభ అనంతరం ప్రధాని మోడీ తిరుపతి ఎయిర్ పోర్టుకు వెళ్తారు. అక్కడి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
విమానాశ్రయం నుంచి విజయవాడ చేరుకుని బందరు రోడ్డులో ఏర్పాటు చేసే రోడ్ షోలో మోదీ పాల్గొంటారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకూ దాదాపు కిలోమీటరుపైగా దూరంలో ఈ రోడ్ షోలో మోదీ ప్రసంగించనున్నారు. రోడ్ షో అనంతరం మోదీ గన్నవరం చేరుకుని అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి వెళ్తారు.
వరంగల్ లో ప్రచార ర్యాలీకు వెళ్తుండగా లక్ష్మీపురం గ్రామంలో నా యువ మిత్రుడిని కలిశాను. 😀 pic.twitter.com/raQhGyMrx6
— Narendra Modi (@narendramodi) May 8, 2024












Click it and Unblock the Notifications