హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జర్వం వస్తే టాబ్లెట్ వేస్కొని రండి: తమిళ నర్సుల నిర్బంధం, హైదరాబాద్ ఆస్పత్రి నిర్వాకం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కరోనా మహమ్మారి విజృంభిస్తున్నవేళ పలు ప్రైవేటు ఆస్పత్రులు అమానుషంగా ప్రవర్తిస్తున్నాయి. వైద్యం కోసం వస్తున్న రోగులకు లక్షలాది రూపాయల బిల్లులు వేసి షాకిస్తున్నాయి. అంతేగాక, ఆస్పత్రుల్లో పనిచేసే నర్సులను కూడా వేధింపులకు పాల్పడుతూ అమానుషంగా ప్రవర్తిస్తున్నాయి.

తాజాగా, నగరంలోని ఓ ఆస్పత్రి నిర్వాకం వెలుగుచూసింది. మెహదీపట్నం నానాల్ నగర్‌లోని ఆలివ్ ఆస్పత్రి యాజమాన్యం ఆ ఆస్పత్రిలోనే పనిచేసే తమిళనాడుకు చెందిన నర్సులను నిర్బంధించింది. జ్వరం వచ్చిందని చెబుతున్నా.. వినిపించుకోకుండా టాబ్లెట్ వేసుకుని విధులకు రావాలంటూ ఆదేశించింది.

A private hospital management harasses tamil nadu nurses.

అంతేగాక, జీతాలు కూడా ఇవ్వబోమని, విధులకు రాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు గురిచేస్తోందంటూ నర్సులు ఆరోపించారు.
ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం తమను ఆదుకుని స్వగ్రామాలకు వెళ్లేలే చూడాలని తమిళనాడు నర్సులు వేడుకుంటున్నారు.

తెలంగాణ నర్సింగ్ సమితికి కూడా బాధిత నర్సులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఈ ఆస్పత్రిలో పనిచేసే కొంత మంది నర్సులకు కరోనా సోకిందని, అయితే, ఆస్పత్రి యాజమాన్యం మాత్రం వారిని సరిగ్గా పట్టించుకోవడం లేదని నర్సులు పేర్కొన్నారు.

కాగా, తెలంగాణలో ఇప్పటి వరకు 43,780 కరోనా కేసులు నమోదు కాగా, 12,764 యాక్టివ్ కేసులున్నాయి. 30,607 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారినపడి 409 మంది మరణించారు.

English summary
A private hospital management harasses tamil nadu nurses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X