హైదరాబాద్‌లో సైకో వీరంగం: దారిన వెళ్లేవారిపై రాడ్‌తో దాడి, ఒకరి పరిస్థితి విషమం

హైదరాబాద్: నగరంలో గురువారం ఓ సైకో వీరంగం సృష్టించాడు. కోఠి పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ జనంపై దాడికి దిగాడు. దీంతో జనాలు పరుగులు పెట్టారు. కాగా, ఆ సైకో ద్విచక్రవాహనంపై వెళ్తున్న రహమాన్ అనే వ్యక్తిపై ఇనుపరాడ్‌తో దాడి చేశాడు.

దీంతో అతని తలపై తీవ్ర గాయమైంది. గాయపడిన రహమాన్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించి చికత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు సైకోను సుల్తాన్‌బజార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీస్ స్టేషన్‌కు తరలించగా, అక్కడ కూడా ఆ సైకో పిచ్చి పిచ్చి మాటలతో గందరగోళం సృష్టించాడు. కాగా, ఆ సైకో మలక్‌పేట వాసిగా పోలీసులు గుర్తించారు. ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగిగా పని చేస్తున్నట్లు చెప్పారు.

A Psycho allegedly attacked on people: One seriously injured

సైకో వద్ద లభించిన ఆధారాల మేరకు అతని కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. మానసకి పరిస్థితి బాగోలేకే ఇలా ప్రవర్తిస్తున్నాడని అతని కుటుంబసభ్యులు పోలీసులకు చెప్పినట్లుగా తెలిసింది. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆ సైకోను ఆస్పత్రికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు.

మెదక్‌ జిల్లాలో మహిళ ఆత్మహత్య

మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడలో లావణ్య అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. దీంతో మృతురాలి భర్త, అత్త, మామ పరారయ్యారు. లావణ్య ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు స్పందించడం లేదని జిల్లా ఎస్పీకి మృతురాలి కూతురు ఫిర్యాదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+