హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఘోరం: ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య: నిందితుడ్ని ఎన్‌కౌంటర్ చేయాలంటూ భారీ ఆందోళన

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సైదాబాద్ సింగరేణి కాలనీలో అదృశ్యమైన ఆరేళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాలికపై అత్యాచారం చేసి, హత్య చేశారని, నిందితుడ్ని తమకు అప్పగించాలంటూ బాలిక కుటుంబసభ్యులు, బంధువులు, స్థానికులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు.

చంపాపేట నుంచి సాగర్ వెళ్లే రోడ్డులో కాలనీవాసులు బైఠాయించి నిరసన కొనసాగిస్తున్నారు. నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయడంతోపాటు తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆందోళనకారులను విరమింపజేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. పోలీసులు కూడా భారీగా మోహరించారు. కాగా, బాలిక హత్యాచారం కేసులో నిందితుడుగా భావిస్తున్న రాజు అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. దీంతో అతడ్ని పట్టుకునేందుకు 10 పోలీసు బృందాలు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు.

A six years girl allegedly raped and murder by youth in Saidabad, Hyderabad

మరోవైపు ఆందోళనకారుల వద్దకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్, డీసీపీ రమేశ్ రెడ్డి వచ్చి మాట్లాడారు. ప్రభుత్వం తరపున బాలిక కుటుంబాన్ని ఆదుకుంటామని, డబుల్ బెడ్ రూం ఇల్లు, పొరుగు సేవల విభాగంలో ఉద్యోగం కల్పిస్తామని బాధిత కుటుంబానికి కలెక్టర్ హామీ ఇచ్చారు. బాధిత కుటుంబంలోని మరో ఇద్దరు పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని భరోసా ఇచ్చారు. వీలైనంత త్వరగా నిందితుడికి జైలు శిక్ష పడేలా చేస్తామన్నారు.

ఈ ఘటన జరగడం దురదృష్టమని ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ రెడ్డి అన్నారు. పాప డెడ్ బాడీ తరలించే టైంలో పోలీసులకు గాయాలయ్యాయని తెలిపారు. పాప డెడ్ బాడీకి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్ మార్టం జరుగుతోందని తెలిపారు. మరో రెండు గంటల్లో నిందితున్ని అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితునికి తొందరగా శిక్ష పడేలా చూస్తామని చెప్పారు. మరోవైపు చిన్నారి ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని బహిరంగంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇది ఇలావుండగా, ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్యపై రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ సీరియస్ అయ్యారు. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. బాలిక కుటుంబాన్ని ఆదుకునేందుకు తక్షణం రూ.50వేల ఆర్ధిక సాయం ప్రకటించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, సిటీ పోలీస్ కమిషనర్లతో మాట్లాడారు మంత్రి సత్యవతి రాథోడ్‌. తగిన చర్యలు తీసుకోవాలని వారికి ఆదేశాలు జారీ చేశారు. దోషులు ఎంతటివారైన ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఉక్కుపాదంతో అణచివేయాలన్నారు. చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని.. దోషులను కఠినంగా శిక్షించి న్యాయం చేస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు.

కాగా, గురువారం సాయంత్రం 5 గంటల నుంచి బాలిక ఆచూకి కనిపించలేదు. ఎంత వెతికినా ఆచూకి లభించకపోవడంతో కుటుంబసభ్యులకు ఇంటికి సమీపంలోనే ఉండే రాజుపై అనుమానం వచ్చి అతని ఇంటికి వెళ్లారు. కానీ, అతని ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో తాళం బద్దలుకొట్టిన పాప తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, స్థానికులు.. రాజు ఇంట్లో కనిపించిన దృశ్యాన్ని చూసి కుప్పకూలిపోయారు. బాలిక అక్కడ విగతజీవిగా కనిపించడంతో అంతా కన్నీళ్లపర్యంతమయ్యారు.

English summary
A six years girl allegedly raped and murder by youth in Saidabad, Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X