మూడో అంతస్తు నుంచి దూకి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య, ప్రేమే కారణమా?
ఆదిలాబాద్: బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న అనూష అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
భవనం మూడో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. అనూష స్వస్థలం సిద్దిపేట జిల్లా మందపల్లిగా గుర్తించారు. ఆమె పుస్తకంలో ఉన్న సూసైడ్ లేఖను ట్రిపుల్ ఐటీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.

తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది. సిద్దిపేటకు చెందిన నాగరాజును ఏమనకూడదని, తాను బతికి ఉంటే నాగరాజుతోనే కలిసి ఉంటానని అనూష తన లేఖలో రాసింది.
దీంతో ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహరమే కారణమని అనుమానిస్తున్నారు. అనూష ఆత్మహత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications