టీచర్ శ్రీదేవికి నిప్పుపెట్టిన సహోద్యోగి: సజీవ దహనం
రంగారెడ్డి: జిల్లాలోని బోడుప్పల్‌లోని ఓ ప్రైవేటు పాఠశాల నిర్వహకురాలు శ్రీదేవి దారుణ హత్యకు గురయ్యారు. విభేదాల కారణంగా పాఠశాల నిర్వహణలో సహ భాగస్వామి అయిన ఓ వ్యక్తి శ్రీదేవీని సజీవదహనం చేశాడు. స్థానికులు నిందితుడిని చితకబాదారు.

అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
దొంగల బీభత్సం: పోలీసుల ఇళ్లల్లో చోరీలు
వరంగల్ జిల్లాలో దొంగలు మంగళవారం తెల్లవారుజామున బీభత్సం సృష్టించారు. ఏకంగా పోలీస్ క్వార్టర్స్‌నే దుండగులు టార్గెట్ చేశారు. పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ క్వార్టర్స్ లోని ఐదు ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడ్డారు. భారీగా నగదు, నగలు అహరించుకు వెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దొంగల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications