విద్యార్థినికి మత్తు మందిచ్చి లైంగికదాడి: టీచర్‌పై నిర్భయ కేసు నమోదు
నల్గొండ/ఆదిలాబాద్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని మంచి మార్గంలో నడపాల్సిన బాధ్యత ఉన్న ఓ ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. తండ్రిగా భావించి వెంటవవచ్చిన ఓ విద్యార్థినికి మత్తు మందు ఇచ్చి లైంగికదాడికి పాల్పడ్డాడు.
ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా కోదాడ మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సదరు బాలిక, మునగాల మండలం ఆకుపాముల శివారులోని బెతానియ క్రైస్తవ పాఠశాలలో పదోతరగతి చదువుతోంది.
పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్న బొబ్బిలి రాజు ఆగస్టు 15న స్టడీమెటీరియల్ ఇస్తానని నమ్మబలికి ఆమెను బైక్‌పై కొమరబండకు తీసుకెళ్లాడు. మత్తుమందు కలిపిన బిస్కెట్లు ఇచ్చి బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. మెలుకువ వచ్చిన తర్వాత ఈ విషయం ఎవ్వరికైనా చెబితే అంతుచూస్తానని ఆమెను బెదిరించాడు.
కాగా, బాలిక సోమవారం బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. సమాచారం అందుకున్న బాలిక తల్లి కోదాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై నిర్భయ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నీట మునిగి నలుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సోమవారం నీటమునిగి నలుగురు మృతిచెందారు. ఆదిలాబాద్ జిల్లా కుంటాల జలపాతంలో సోమవారం ఇద్దరి మృతదేహాలు లభించాయి. మృతులు నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం దోమకొండకు చెందిన అన్నదమ్ములు చెన్నూరి సంతోష్(26), అంబాదాస్(22)గా గుర్తించారు.
చీరల వ్యాపారం చేసే వీళ్లు శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. రెండు రోజులుగా కుంటాల జలపాతం సమీపంలో వీరి బైక్ నిలిపి ఉండటంతో... ఇక్కడే వీరి కోసం గాలించారు. సోమవారం ఇద్దరి మృతదేహాలు నీటిపై తేలాయి.
కాగా, సంతోష్‌కు భార్య, కూతురు ఉన్నారు. మరోఘటనలో నిర్మల్ రూరల్ గాజులపేట్ వైయస్సార్ కాలనీకి చెందిన స్నేహితులు హైమద్ (20), సులేమాన్ (19) సోమవారం కాలనీ సమీపంలోని పల్లెచెరువులో స్నానానికి వెళ్లారు. ఈత రాకపోవడంతో నీట మునిగి మృతిచెందారు.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications