మంచు పర్వతం నుంచి జారిపడి తెలుగు జవాన్ మృతి
శ్రీనగర్/ఆదిలాబాద్: జమ్మూకాశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ఓ తెలుగు జవాను మృతి చెందాడు. ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన వైశాక సంతోష్(28) రెండు రోజుల క్రితం మంచు పర్వతంపై నుంచి జారిపడి మరణించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.
ఈ మేరకు సంతోష్ కుటుంబసభ్యులకు ఆదివారం ఫోన్ ద్వారా సమాచారం అందించారు. మృతదేహం మంచులో కూరుకుపోవడంతో.. బయటకు తీసేందుకు శ్రమించాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు.

అనంతరం లేహ్ వరకూ తీసుకొచ్చినా అక్కడి నుంచి తరలించలేని పరిస్థితి ఎదురైందని తెలిపారు. అయితే, సోమవారం సాయంత్రానికల్లా కాగజ్‌నగర్‌కు మృతదేహాన్ని చేర్చేందుకు కృషి చేస్తామని అధికారులు చెప్పారు.
కాగజ్‌నగర్‌లోని నౌగాంబస్తీకి చెందిన వైశాక భీమన్న-మణెమ్మ దంపతులు పెద్ద కుమారుడైన సంతోష్ 2005లో భారత సైన్యంలో చేరారు.












Click it and Unblock the Notifications