వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుండెపోటుతో మూడోతరగతి విద్యార్ధి మృతి.. స్కూల్లోనే కుప్పకూలిపోయిన తొమ్మిదేళ్ళ బాలుడు!!

|
Google Oneindia TeluguNews

హార్ట్ ఎటాక్... ఇప్పుడు సమాజంలో ఒక ఆందోళనకరమైన పరిస్థితిని కలిగిస్తున్న సమస్య. హార్ట్ ఎటాక్ ఎప్పుడు వస్తుందో? ఎవరికి వస్తుందో? ఎందుకు వస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎంతో ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు సైతం హార్ట్ ఎటాక్ బారినపడి మృతి చెందుతున్న ఘటనలు అనేకం కనిపిస్తున్నాయి.

ఆగని పరువు హత్యలు.. వనపర్తిలో కూతురిపై అనుమానంతో హతమార్చిన తండ్రిఆగని పరువు హత్యలు.. వనపర్తిలో కూతురిపై అనుమానంతో హతమార్చిన తండ్రి

తొమ్మిదేళ్ళ బాలుడికి హార్ట్ ఎటాక్

తొమ్మిదేళ్ళ బాలుడికి హార్ట్ ఎటాక్


వృద్ధులు, నడివయస్సు వారు, ఊబకాయం ఉన్నవారు మాత్రమే హార్ట్ ఎటాక్ బారిన పడడం లేదు. ఎప్పుడూ ఆట పాటలతో సంతోషంగా ఉంటున్న పిల్లలు సైతం హార్ట్ ఎటాక్ బారిన పడి మృతి చెందటం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇలాంటి విషాద ఘటన చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావు పల్లి గ్రామానికి చెందిన మూడవ తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలుడు కౌశిక్ పాఠశాలలో భోజనం సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు.

 స్కూల్ లో భోజనానికి నిలబడి కుప్పకూలిన బాలుడు

స్కూల్ లో భోజనానికి నిలబడి కుప్పకూలిన బాలుడు


దీపావళి పండుగ రోజు రాత్రి కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా టపాసులు కాల్చిన బాలుడు కౌశిక్ , ఉదయం లేచి యధావిధిగా స్కూల్ కి వెళ్ళాడు. స్కూల్లో మధ్యాహ్నం వరకు తరగతులు విన్న పిల్లవాడు, మధ్యాహ్న భోజనం కోసం క్యూ లైన్ లో స్నేహితులతో కలిసి నిలబడ్డాడు. అంతవరకు సరదాగా ఉన్న కౌశిక్ ఒక్కసారిగా క్యూ లైన్లో కుప్ప కూలిపోయాడు. దీంతో స్కూల్ లోని మిగతా విద్యార్థులు వెంటనే టీచర్ కు సమాచారం ఇచ్చారు. టీచర్లు విద్యార్థిని గ్రామంలోని వైద్యుని వద్దకు తీసుకు వెళ్ళగా కౌశిక్ కు గుండె పోటు వచ్చినట్టు తేల్చారు. దీంతో కరీంనగర్ కు బాలుడిని తీసుకువెళ్లాలని సూచించారు.

 చిన్న పిల్లాడికి హార్ట్ ఎటాక్ రావటంతో షాక్ లో కుటుంబం

చిన్న పిల్లాడికి హార్ట్ ఎటాక్ రావటంతో షాక్ లో కుటుంబం


ఇక ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే బాలుడు ప్రాణాలు విడిచాడు. కరీంనగర్ ఆస్పత్రి వైద్యులు బాలుడు మృతి చెందినట్టు ధృవీకరించారు. ఇక కొడుకు చనిపోవటంతో కౌశిక్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కౌశిక్ మృతి చెందిన వార్త విన్న తల్లిదండ్రులు గుండెలవిసి పోయేలా రోదించారు. చిన్న పిల్లవాడికి హార్ట్ ఎటాక్ రావటం ఏమిటని గ్రామస్తులంతా కన్నీరు పెట్టుకున్నారు. ఇక కౌశిక్ తోటి విద్యార్థులు, స్కూల్ టీచర్లు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే కౌశిక్ మృతితో తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. 9 సంవత్సరాల బాలుడు హార్ట్ స్ట్రోక్ బారిన పడిన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా షాకింగ్ గా మారింది.

English summary
The incident where a third class student died due to heart attack took place in Rajanna Siricilla district. The boy collapsed at school and died before being taken to the hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X