విషాదం: కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులో దూకిన యువతి

హైదరాబాద్: నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. దుర్గం చెరువులోకి దూకి స్వప్న అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం కేబుల్ బ్రిడ్జి పైనుంచి నడుచుకుంటూ వెళ్లినన స్వప్న ఒక్కసారిగా చెరువులోకి దూకింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

అక్కడేవున్న కొందరు సందర్శకులు ఆమె దూకడాన్ని గమనించి కాపాడడానికి ప్రయత్నించారు. కానీ, ఆమె ఆచూకీ కనిపించలేదు. స్వప్న దూకిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. యువతి బ్లాక్ కలర్ డ్రెస్ ధరించినట్లు.. ఆమె వయస్సు 25 నుంచి 30 సంవత్సరాలు ఉండవచ్చని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

 A woman allegedly commits suicide, jumping into Durgam Cheruvu from cable bridge

సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆమె కోసం పోలీసులు, డీఆర్​ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. స్పీడ్ బోట్లతో చెరువులో గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న స్వప్న అక్క ఘటనా స్థలానికి చేరుకుంది.

స్వప్న మానసికంగా బాధపడుతోందని ఆమె తెలిపారు. బుధవారం ఇంటి నుంచి బయటకు వచ్చిందని తిరిగి ఇంటికి రాలేదని.. పోలీసులు నుంచి ఫోన్ వచ్చాకే తమకు విషయం తెలిసిందని స్పప్న సోదరి తెలిపారు. యువతి ఆత్మహత్య ఘటన స్థానికంగా కలకలంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+