వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. కొడుకును చంపి ఇంట్లోనే పాతిపెట్టింది
మహబూబ్‌నగర్: తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్నకొడుకునే హతమార్చింది ఓ దుర్మార్గపు తల్లి. ఈ దారుణ ఘటన జిల్లాలోని మల్దకల్ మండలం అమరవాయిలో చోటు చేసుకుంది.
నెల క్రితం కొడుకును హత్యచేసి ఇంట్లోనే మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. కాగా, ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పోలీసులపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు, నిందితురాలిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, 12 ఏళ్ల క్రితం భర్తను కూడా హత్య చేసినట్టు ఆ మహిళపై ఆరోపణలున్నాయి.

టేకుమట్ల వద్ద బస్సు బోల్తా: ఒకరు మృతి
నల్గొండ జిల్లా సూర్యాపేట మండలం టేకుమట్ల వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఢీవైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా, పదిమంది ప్రయాణికులకు గాయాలైయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. బస్సు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
కవేలిలో రెండు బైకులు ఢీకొని ఇద్దరి మృతి
మెదక్ జిల్లాలోని కోహీర్ మండలం కవేలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్తికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఇద్దరు మృతిచెందారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications