బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు
కరీంనగర్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీఆర్ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో తనకు ప్రాణహాని ఉందని ఓ మహిళ జాతీయ మహిళా సంఘం(NCW)కు ఫిర్యాదు చేసింది. సెజల్ అనే మహిళ ఆరిజిన్ డెయిరీ కో-డైరెక్టర్ పనిచేస్తోంది. అయితే, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమను బ్లాక్ మెయిల్ చేస్తూ.. పోలీసులతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించింది.
ఎమ్మెల్యేపై తెలంగాణ పోలీసులకు చాలా సార్లు ఫిర్యాదు చేశామని.. అయితే, దుర్గం చిన్నయ్య అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఫిర్యాదు రిజిస్టర్ కానివ్వకుండా చేశాడని సదరు మహిళ తెలిపింది. ఈ మేరకు బాధితురాలు సోమవారంఢిల్లీలోని మహిళా సంఘానికి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఫిర్యాదు చేసింది.

తనకు తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ హామి ఇచ్చిందని బాధితురాలు సెజల్ తెలిపారు. సదరు మహిళ ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా తెలిపింది. గతంలో కూడా ఎమ్మెల్యే చిన్నయ్యపై ఆమె పలు ఆరోపణలు చేశారు.
'తప్పు చేసింది ఎమ్మెల్యే అయినా.. ఎవరైనా వదిలిపెట్టేదిలేదు గుర్తుపెట్టుకోండి..ఇకనైనా ఎమ్మెల్యే మీ అనుచరులతో బెదించండం..వేధింపులకు గురిచేయడం ఆపితే మీకే మంచిది" అని బాధితురాలు హెచ్చరించింది. అయితే బాధితురాలి ఫిర్యాదుతో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను విచారించేందుకు మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
గతంలో టోల్ సిబ్బందిపై దాడి
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గతంలో టో ల్ సిబ్బందిపై దాడి చేసిన ఘటన సంలచనంగా మారిన విషయం తెలిసిందే. మందమర్రి టోల్ ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దాడికి దిగారు. ఓ ఉద్యోగి చెంప పగులగొట్టారు. తన కారును అడ్డుకోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి బెల్లంపల్లికి వెళ్తోన్న సమయంలో మార్గమధ్యలో మందమర్రి టోల్ ప్లాజా వద్ద ఆయన కారును అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు.
టోల్ అమౌంట్‌ను వసూలు చేయడానికి వారు ఆయన కారును ఆపడంతో దుర్గం చిన్నయ్య ఆగ్రహానికి గురయ్యారు. కారు దిగి నేరుగా టోల్ బూత్ వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. సిబ్బందితో గొడవ పడ్డారు. ఓ ఉద్యోగి చెంప పగులగొట్టారు. ఆయన అనుచరులు వారిస్తున్నప్పటికీ వినిపించుకోలేదు. ఈ వ్యవహారం అంతా టోల్ ప్లాజా వద్ద అమర్చిన సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయింది.












Click it and Unblock the Notifications