బాకీ తీర్చకపోతే నా కోరిక తీర్చు, వివాహిత ఏం చేసిందంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

తూప్రాన్: అప్పు తీర్చకపోతే ఆ డబ్బుల కింద తన కోరికను తీర్చాలని ఓ వివాహితను వేధింపులకు గురిచేశాడు ఓ వ్యక్తి . ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకొంది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేసింది.

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఘనపూర్ పంచాయితీ పరిధిలోని దమ్మక్కపల్లిలో ఈ ఘటన చోటుచేసుకొంది. దమ్మక్కపల్లికి చెందిన ఓ వ్యక్తి అదే గ్రామానికి చెందిన చిల్ల సత్తయ్య వద్ద రెండేళ్ళ క్రితం కొంత నగదును అప్పుగా తీసుకొన్నాడు.

A woman complaint against Sattaih for sexual harassment in Medak district.

అయితే ఈ దంపతులు ఈ నగదును తీర్చలేదు. అయితే ఈ విషయమై సత్తయ్య పంచాయితీ పెట్టాడు. బాకీ చెల్లింపుకు పెద్దలు కొంత గడువిచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం నాడు వివాహితను సత్తయ్య అడ్డగించాడు.

బాకీ డబ్బులు చెల్లించకపోతే ఆ బాకీ కింద తన కోర్కె తీర్చాలని వేధించాడు. లేదంటే ఆమెను, పిల్లలను చంపేస్తానని బెదిరించాడు. అయితే ఈ మేరకు సత్తయ్యపై భర్తతో కలిసి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman complaint against Sattaih for sexual harassment in Medak district. Sattaih given some amount to a lady before two years back.But didn't return this amount, so he sexually harassed her.
Please Wait while comments are loading...