ఉద్యోగమిచ్చి.. మహిళా మేనేజర్‌పై యజమాని, స్నేహితుల గ్యాంగ్‌రేప్

హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేసే ఓ ఉద్యోగినిపై ఆ సంస్థ యజమాని, మరో ఇద్దరు స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు సెప్టెంబర్ 25న కోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

రేప్ విషయం బయటకు చెపితే చంపేస్తానని ఆ ముగ్గురు నిందితులు బెదిరించారని బాధితురాలు కోర్టుకు తెలిపింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. హబ్సిగూడలోని ఫార్చున్ బట్టర్ ఫ్లై సిటీ కార్యాలయంలో మార్కెటింగ్ మేనేజర్ ఉద్యోగం ఉందని తెలిసి బాధితురాలు దరఖాస్తు చేసుకుంది.

ఇంటర్వ్యూ చేసిన సంస్థ యజమాని సంకు రమణ.. బాధితురాలికి ఉద్యోగం ఇచ్చాడు. కొద్దిరోజుల తర్వాత మాదాపూర్‌లో మరో బ్రాంచ్ ప్రారంభిస్తున్నామని, అక్కడే పని చేయాల్సి ఉంటుందని మహిళకు చెప్పాడు.

A woman employee gangraped in Hyderabad

దీంతో గత నవంబర్ నుంచి బాధితురాలు మాదాపూర్‌లోని కార్యాలయానికి వెళ్తోంది. కాగా, ఆగస్టు 30వ తేదీన బాధితురాలిని అయ్యప్ప సొసైటీలోని ప్లాట్‌కు రమణరప్పించాడు.

ఆ తర్వాత అతని స్నేహితులు కిరణ్, రాజేశ్‌తో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+