Siricilla: ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ..
సాధారణంగా ఒక్క కాన్పులో ఒక్కరి జన్మిస్తారు. ఒక్కోసారి కవలలకు జన్మిస్తారు. రేర్ కేసుల్లో ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిస్తారు. కానీ ఓ మహిళ నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ మహిళ నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. వైద్యులు అరుదైన శస్త్రి చికిత్స నిర్వహించి శిశువులను బయటకు తీశారు. తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
జిల్లాలోని గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్ కు చెందిన గొట్టుముక్కల లావణ్య డెలవరీ కోసం ఆస్పత్రికి వచ్చారు. అయితే అప్పటికే ఆమె అక్కడికి నెలనెలా చెకప్ కు వెళ్లేవారు. కడుపులో నలుగురు శిశువులు వైద్యులకు తెలుసు.. దీంతో చాలా జాగ్రత్తగా ఆపరేషన్ చేసి శిశువులను బయటకు తీశారు. లావణ్యకు మొదట బాబు జన్మించగా.. తర్వాత పాప, బాబు, బాబు పుట్టారని వైద్యులు చెప్పారు.

లావణ్యకు 9 సంవత్సరాల కింద మొదటి కాన్పులో ఒక బాబు జన్మించాడు. మళ్లీ ఇప్పుడు రెండో కాన్పులో నలుగురు బిడ్డలు పుట్టడంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. డెలవరీ అనంతరం అనంతరం పిల్లలను సిద్దిపేటలోని పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లారు. గతంలో ఆఫ్రికాలోని ఓ దేశానికి చెందిన మహిళ ఒకే కాన్పులో తొమ్మిది మందికి జన్మనిచ్చింది. ఆ మహిళ గిన్నిస్ రికార్డులకెక్కి సెలబ్రిటీగా మారిపోయింది.













Click it and Unblock the Notifications