ఈ దివ్యాంగురాలికి TSPSC సమాధానం చెప్పాల్సిందేనా..!
టీఎస్సీఎస్సీ పెద్దల నిర్లక్ష్యంతో లక్షలాది నిరుద్యోగుల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం ఉద్యోగాలు నోటిఫికేషన్ వేయగానే.. కోచింగ్ బాట పట్టారు. అప్పులు తెచ్చి మరి కోచింగ్ తీసుకున్నారు. ఇంటి వద్ద తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకుని.. కొడుకు కొలువ వస్తుందని ఆశతో డబ్బులు పంపించారు. కానీ టీఎస్పీఎస్సీ వారి ఆశను వమ్ము చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించి పేపర్ల లీక్ పరోక్షంగా కారణమయింది.
టీఎస్సీఎస్సీ ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉంటే ఇలా జరిగేది కాదని మేధావులు చెబుతున్నారు. ఇంత జరిగినా కూడా టీఎస్సీఎస్సీలో ఓ ఒక్క ఉన్నతాధికారిని సస్పెండ్ కాదు కదా.. బదిలీ కూడా చేయలేకపోయిందని విమర్శలు వస్తున్నాయి.ముఖ్యంగా గ్రూప్-1 ఉద్యోగం కోసం చాలా మంది చిన్న చిన్న ఉద్యోగాలు విడిచిపెట్టి మరి చదివారు. కానీ పేపర్ లీక్ తో పరీక్ష రద్దయింది. దీంతో ఏం చేయాలో తెలియన స్థితిలో ఉన్నారు.

కొత్తగా పరీక్ష ఫీజు తీసుకోకుండానే పరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి రావాలంటే డబ్బులు ఖర్చు పెట్టక తప్పదు. ఛార్జీలకు కూడా డబ్బులు లేని వారు ఉంటారా అని మీరు ప్రశ్నించవచ్చు కానీ.. ఉంటారని మీరు గుర్తుంచుకోవాలి.కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శాంతినగర్ కాలనీకి చెందిన మల్లయ్య తిరుపతమ్మకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చిన్న కుమార్తె భవాని దివ్యాంగురాలు.
ఆమె మాట్లాడలేదు. చెవులు కూడా సరిగా వినపడవు అయినా ఆమె డిగ్రి పూర్తి చేసింది. గ్రుప్-1 ప్రిలిమ్స్ రాసి క్వాలిఫై కూడా అయింది. కానీ పరీక్షల రద్దు తీవ్ర ఆవేదనకు గురవుతుంది. తమకు ఉండడానికి ఇల్లు కూడా లేదని వాపోతుంది. మళ్లీ పరీక్ష రాసే స్తోమత తనకు లేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది. దాతలు ఆదుకోవాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications